– మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మంగళగిరి: సిగ్గు శరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు చీ కొట్టి11సీట్లు ఇచ్చారు.రాష్ట్రంలో నుండి ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారు. గత వైసీపీ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు మర్చిపోయి ఇప్పుడు సుద్దాపుసలాగా మాట్లాడుతుంది.
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల నయా పంథాలో దోపిడీ చేసి గురివింద సామెతలు చెబుతుంది. యువత పేరుతో అడుదాం ఆంధ్ర అని పెట్టి, వృద్ధుల పేర్లతో దోపిడీ చేసిన సంగతి బట్టబయలు అయినా ఇంకా మాట్లాడటం సిగ్గుచేటు. రోజా ఇప్పుడు గురివింద గింజ సమేత గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది.
వైసీపీ అక్రమ దోపిడీ అన్యాయాలు మరచిపోయి11సీట్లుఇచ్చినా సిగ్గులేకుండా మాట్లాడుతూ ఉండటం చూస్తే, ఇంగిత జ్ఞానం లేని వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదు. మహిళలకు అమ్మకు వందనం ఇస్తాం,రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలుజోరుగా అమలులోకి వచ్చాయి. వైసీపీ వాళ్ళకి రెడ్ బుక్ పేరుతోచెబితే భయపడి పారిపోతున్నారు. సంక్షేమo వేస్తున్న అభివృద్ధి కే పెద్దపీట కూటమి ప్రభుత్వం. వైసీపీ దౌర్జన్యం ప్రజలు చూశారు,అందుకే 11సీట్లు ఇచ్చారు. పరదాల పాలన, అక్రమ కేసులు, దౌర్జన్యం, ఇవ్వన్నీ వైసీపీ సొంత పాలన.