Suryaa.co.in

National

పంచె కు గ్లాసుకోల్ పంచె కు తేడా ఏమిటి?

అవి గ్లాసుకోల్ లేదా గ్లాస్కో లేదా గ్లా క్సో కాదు, వాటిని Glasgow పంచెలు అంటారు, గ్లాస్గో అనేది ఇప్పటి స్కాట్లాండ్ లో ముఖ్య నగరం,United Kingdom లేదా బ్రిటన్ లో భాగమైన ఈ నగరం దాదాపు లండన్ సిటీ కి పోటీగా అభివృద్ధి చెందినది, ఇంగ్లండ్ లో ఉన్న మూడు పెద్ద నగరాల్లో ఒకటిగా ఫ్యాషన్ వస్త్రాలకు ఖ్యాతి గాంచింది

గ్లాస్గో అనేది ఒక బ్రాండ్…బొంబాయి రవ్వ, కరాచీ బేకరి, బందరు లడ్డు, కాకినాడ కాజా, హైదరాబాద్ బిర్యానీ లాగ !

భారత దేశాన్ని బ్రిటీషు వారు పరిపాలించే కాలంలో ఇక్కడి నుంచి ముడి పత్తి ని నౌకల్లో ఇంగ్లండ్ కు ఎగుమతి చేసి, అక్కడి ఆధునిక బట్టల మిల్లుల్లో దాన్ని ప్రాసెస్ చేసి ఫైన్ వెరైటీ క్లాత్ గా మార్చే వారు, ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న పత్తే చాలా నాణ్యమైనది అయినందున దాని నుంచి తయారైన వస్త్రం చాలా పల్చగా నాజూకుగా ఉండేది

మనదేశంలో అప్పుడు చేనేత వారు నేసిన ముతక వస్త్రాలనే ధరించేవారు, 1760 నుంచి 1840 వరకూ చరిత్రలో తొలి పారిశ్రామిక విప్లవం సాగినట్టు భావిస్తారు, అందులో భాగంగా ఇంగ్లండ్ లో లండన్, మాంచెస్టర్, గ్లాస్గో లలో ఫ్యాక్టరీలు, భారీ యంత్ర సామగ్రితో కూడిన ఉత్పత్తి కేంద్రాలు వచ్చాయి, వాటిలో తయారైనదే గ్లాస్గో క్లాత్.

భారత దేశంలో సంప్రదాయ పరంగా పంచె కట్టు లేదా ధోతీ ధరించడం గమనించిన బ్రిటిష్ వస్త్ర వ్యాపారులు అదే వస్త్రాన్ని ఎగుమతి చేసే వారు!

మనదేశంలో అప్పటికి బట్టల మిల్లులు లేవు, అందుచేత గ్లాస్గో లో తయారైన అతి పలచన, transparent వస్త్రానికి అధిక డిమాండ్ ఉండేది, వీటిని కట్టుకోవడం సమాజంలో హోదాకు చిహ్న మైనం దున అప్పటి సంపన్న వర్గాలు అనగా జమీందారులు, భూస్వాములు మాత్రమే కొనగలిగే వారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ పిలుపు ఇచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ లో ఈ Glasgow cloth కూడా ఉంది, స్వదేశీ ఉద్యమ కారులు ఈ వస్త్రాన్ని వీధుల్లో గుట్టలుగా పోసి దహనం చేసి బ్రిటిష్ వారికి తమ నిరసన తెలిపారు, దేశ స్వాతంత్ర్యం ముందే మనదేశంలో బ్రిటిష్ Textile knowledge తో బొంబాయి , సూరత్, అహ్మదాబాద్ లలో textile మిల్స్ వచ్చాయి, వాటిలో కూడా ఈ Glasgow వస్త్రాన్ని లేదా కొలతల ప్రకారం పంచెల్ని తయారు చేసే వారు

క్ర మేణా ఈ పంచెలకు గ్లాస్గో పేరే స్థిర పడింది, ఇప్పటికీ అదే కొనసాగు తోంది, ఇప్పుడు ధనికులే కాదు, సామాన్యులు కూడా ఈ వస్త్రాన్ని కొనగలరు, పంచెలుగానే కాక చొక్కాలు, లాల్చీలుగా కూడా దీన్ని కుట్టించు కుంటారు, పూర్వం రోజుల్లో ఇంటి అల్లుళ్ళకు , పెద్దలకు గ్లాస్గో పంచెలు పెట్టడం , చొక్కాలకు సరిపడ వస్త్రం యిచ్చి గౌరవించడం ఉండేది, టెర్లిన్, టెరి కాటన్, పాలియేస్టర్, స్పన్ వగైరా వస్త్రాలు రాకముందు ప్రీమియం క్లాత్ గా గ్లాస్గో వస్త్రం వెలిగిపోయింది!

చేనేత పంచెల్లో నూరో నంబరు పంచెలు, అంచు పంచెలు, పెదరాయుడు పం చె లు, ఖద్దరు పంచెలు అని చాలా వెరైటీ లు ఉంటాయి , వాటికి భిన్నంగా గ్లాస్గో పంచెలు రిచ్ గా కనబడతాయి, ప్రస్తుతం పంచెలు కట్టుకుని తిరిగే తరం నెమ్మదిగా అంతరిస్తోంది!

– వైవిఆర్

LEAVE A RESPONSE