Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు

– దాడులు ఆపకపోతే జరిగేది అదే
– మీ సర్కారుకు నూకలు చెల్లాయి
– ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా?
– ప్రతిపక్షాలపై దాడులు చేసి గెలవాలనుకుంటున్నారా?
– నర్సరావుపేట ఆసుపత్రిలో బీజేపీ నేతను పరామర్శించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్

నరసరావుపేట:‘‘ వైసీపీ పాలనకు నూకలు చెల్లిపోయాయి. ఆ నిజం గ్రహించే వాళ్లు విపక్షాలపై దాడులు చేసి అధికారం కాపాడుకోవాలనుకుంటున్నారు. మేం హెచ్చరిస్తున్నాం. జగన్ గారూ.. గ్రామాల్లో మాపై మీ పార్టీ నేతల దాడులు ఆపకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళతారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడులు ఆపకపోతే రేపు జరగబోయేది ఇదే. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇంత కండకావమా? ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా? పోలీసులను అడ్డుపెట్టుకుని ఎంతకాలం పాలిస్తారో మేమూ చూస్తాం.

ఈ రాష్ట్రం మీ జాగీరా? ప్రజలు, ప్రతిపక్షాలు మీ తాడేపల్లి పాలేర్లు అనుకుంటున్నారా? మా పార్టీ నేతపై చర్యలు తీసుకోకపోతే పోలీసుస్టేషన్‌ను ముట్టడిస్తాం. రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు పాలించలేదు? ఎంతమంది సీఎంలు పాలించలేదు. మీలాంటి నియంతలకు బీజేపీ భయపడే ప్రసక్తేలేద’’ని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ యాదవ్ సీఎం జగన్‌ను హెచ్చరించారు.

నరసరావుపేట బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణపై అల్లూరువారిపాలెంలో వైసీపీ ఎంపిటీసీ వెంకటప్పారెడ్డి, జయభారత్‌రెడ్డి నేతృత్వంలో చేసిన దాడికి రామకృష్ణ తీవ్రంగా గాయాలయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామకృష్ణను పరామర్శించేందుకు వచ్చిన సత్యకుమార్, జరిగిన సంఘటనపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సత్యకుమార్ మీడియాతో ఏమన్నారంటే.. ‘‘ కర్రలు, రాళ్లతో కార్యకర్తలపై దాడులు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తమ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే, పోలీసులు ఉన్నతాధికారులకు చెప్పాలని కేసు నమోదు చేయకుండా తప్పించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై ఎన్ని దాడులు చేస్తున్నా సరే.. కేసులు 10 శాతం కూడా నమోదు చేయడం లేదు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ వర్గీయులు చిచ్చు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కేవలం ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసి గెలవాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు. కేసు నమోదు చేయకపోతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తాం. దాడులు ఆపకపోతే జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోతా రు. ఈ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవా లి ’’

LEAVE A RESPONSE