Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల సొమ్ముతో IPAC సిబ్బంది సోకులు’ అనే రూ.274కోట్ల కుంభకోణంలో ప్రధాన పాత్రధారి జగన్ రెడ్డే

• వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో జిల్లాలవారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లించడంపై జగన్ రెడ్డి నోరు విప్పాలి
• ప్రజలసొమ్ముని ఐ ప్యాక్ సంస్థకు దోచిపెట్టి.. సదరు సంస్థద్వారా తాను.. తన పార్టీ… తన ప్రభుత్వం పొందిన లబ్ధి ఏమిటో జగన్ రెడ్డి చెప్పాలి
• మూడు సంస్థల్ని ఎఫ్.ఓ.ఏగా చెప్పిన జగన్ సర్కార్.. వాటి సేవల వినియోగం కోసం నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచిందా?
• రూ.274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ మరియు కేబినెట్ అనుమతి ఉందా?
• రామ్ ఇన్ ఫో సిబ్బంది… ఐ ప్యాక్ సిబ్బంది ఒక్కటేనని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే జిల్లా యంత్రాంగం రామ్ ఇన్ ఫో సిబ్బందికి ప్రభుత్వాధికారుల సహకరించాలని ఎలా ఆదేశాలిచ్చింది?
• ఇలాంటి అనేక ప్రశ్నలపై ముఖ్యమంత్రి తక్షణమే నోరు విప్పాలి
• జగన్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించకుంటే, త్వరలోనే ‘డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు… వైసీపీ సోషల్ మీడియా సోకులు’ అనే మరో బాగోతం బయటపెడతాం
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ఎవరికీ తెలియకుండా.. ఎంతో తెలివిగా సంవత్సరానికి రూ.68కోట్ల చొప్పున నాలుగే ళ్లలో వాలంటీర్ల పేరుతో జగన్ రెడ్డి రూ.274 కోట్ల ప్రజలసొమ్ము దారిమళ్లించారని, సొం తపార్టీ ప్రచారం కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ సంస్థకు ఆ మొత్తం నిధుల్ని ముఖ్యమంత్రి అప్పనంగా దోచిపెట్టారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రూ.274కోట్ల సొమ్ము దారిమళ్లిన వైనాన్ని విలేకరులకు వివరించా రు. ఆ వివరాలు విజయ్ కుమార్ మాటల్లోనే …

“ వాలంటీర్లపై పర్యవేక్షణ పేరుతో పొలిటికల్ కన్సల్టెన్సీ అయిన ఐప్యాక్ (IPAC) సంస్థ సిబ్బందిని రాష్ట్రవ్యాప్తంగా జగన్ రెడ్డి సర్కార్ నియమించింది. ఇందుకోసం మూడు షెల్ కంపెనీలను జగన్ రెడ్డి అండ్ కో ఒక కన్సార్టియంగా ఏర్పరిచారు. ఆ మూడు షెల్ కంపెనీల్లో ప్రధానంగా వ్యవహరించిన కంపెనీకి ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు అందించారు. మరలా అవే నిధుల్ని ఐప్యాక్ సిబ్బందికి జీతాల రూపంలో చెల్లించారు. మూడు షెల్ కంపెనీల్లో ముందుండి ఈ వ్యవహారం నడిపిన సంస్థ పేరు రామ్ ఇన్ ఫో. ఆ సంస్థకు జీవో ఇచ్చి మరీ ప్రభుత్వ ఖజానా నుంచి జగన్ సర్కార్ నిధులు చెల్లించిం ది. ఇలా నాలుగేళ్లలో రూ.274కోట్లు..అంటే ఏటా రూ.68కోట్ల చొప్పున చెల్లించింది.

ప్రభుత్వ సొమ్ముతో IPAC సోకులు
తెరచాటున జరిగిన ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే ప్రభుత్వ సొమ్ముతో IPAC (ఐ ప్యాక్) సోకులు అని చెప్పొచ్చు. ఐప్యాక్ అనే సంస్థ అనేక రాష్ట్రాల్లో రాజకీయపార్టీల కోసం డబ్బులు తీసుకొని పనిచేస్తోంది. అలానే ఏపీలో జగన్ రెడ్డి సొంత పార్టీ వైసీపీ కోసం క్షేత్రస్థాయి నుంచే పనిచేస్తోంది. అలాంటి సంస్థకు ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యం తో జగన్ రెడ్డి అండ్ కో అప్పనంగా ప్రజలసొమ్ముని దోచిపెట్టారు.

వాలంటీర్లపై పర్యవేక్ష ణ పేరుతో జిల్లాలవారీగా నియమించిన ఐప్యాక్ సిబ్బందికి ఈ విధంగా చెల్లింపులు చేశారు. ఈ నిధులు చెల్లించడం కోసం ప్రభుత్వం చెప్పిన మూడు షెల్ కంపెనీల్లో ఒక్క టే ప్రధానమైంది. రామ్ ఇన్ ఫో అనే సంస్థ మొత్తం వ్యవహారాలు చక్కబెడుతుంటే, ఉపాధి ఇన్ ఫో టెక్.. మాక్స్ డిటెక్టివ్ సర్వీసెస్ అనే రెండూ సంస్థలు డొల్లకంపెనీలు.

ఐప్యాక్ సిబ్బందికి డిటెక్టివ్ సర్వీసెస్ సంస్థ అయిన మాక్స్ సంస్థకు సంబంధమేంటి? ఐ ప్యాక్ సిబ్బందిని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం విడుదలచేసిన జీవోల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వ వాలంటీర్లపై పెత్తనాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. ఏ రామ్ ఇన్ ఫో సంస్థకైతే ప్రభుత్వం వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిందో… వారందా ఐప్యాక్ ఉద్యోగులే. 2020 జూన్ నుంచి ఇప్పటివరకు మొత్తం ఆ సంస్థ ఉద్యోగులని చెప్పబడుతున్న ఐప్యాక్ విభాగం ఉద్యోగులకు రూ.200 కోట్లవరకు ప్రభుత్వమే చెల్లించింది. ఈ సంవత్సరం చెల్లించాల్సింది కూడా కలిపితే మొత్తం రూ.274 కోట్లు అవుతుంది.

ప్రభుత్వ వ్యవస్థ అయిన వాలంటీర్ల పర్యవేక్షణ భాద్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమే
రాష్ట్రంలోని వాలంటీర్లపై పర్యవేక్షణకు.. వారికి శిక్షణ ఇచ్చేందుకు.. ప్రత్యేకంగా ఒక సంస్థను నియమిస్తున్నట్టు.. ఆ సంస్థ ఉద్యోగులు ఇకపై వాలంటీర్లపై నిఘా ఉంచుతార ని తెలియచేస్తూ, జూలై 29, 2021లో అజయ్ జైన్ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇవ్వక ముందే ప్రభుత్వం నోటిమాటగా రామ్ ఇన్ ఫో సంస్థ సేవల్ని వాలంటీర్ల కోసం వినియో గించనున్నట్టు చెప్పింది. 2021లో ఇచ్చిన జీవోకి కొనసాగింపుగా వాలంటీర్లపై పర్యవే క్షణ బాధ్యతల్ని రామ్ ఇన్ ఫో, ఉపాధి ఇన్ ఫోటెక్, మాక్స్ సెక్యూరిటీ డిటెక్టివ్ ఏజన్సీ స్ సంస్థలకు అప్పగిస్తున్నట్టు, అందుకోసం రూ.68,62,84,520లు చెల్లిస్తున్నట్టు, ఇదంతా 2020 జూన్ నుంచే అమల్లోకి వచ్చినట్టు చెబుతూ పోస్ట్ ఫ్యాక్ట్ జీవో ఇచ్చారు.

ఈ వ్యవహారానికి జగన్ సర్కార్ పెట్టిన ముద్దు పేరు ఎఫ్.ఓ.ఏ (ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ). తమసంస్థకు చెందిన 1061 మంది సిబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమింపబడినట్టు రామ్ ఇన్ ఫోసంస్థ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోపనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ కోసమని చెప్పి, ప్రైవేట్ సంస్థ సిబ్బందిని నియమించడం ము మ్మాటికీ చట్టవిరుద్ధమే. ప్రజల సమాచారం మొత్తం వాలంటీర్ల ద్వారా సదరు ప్రైవేట్ సంస్థకు చేరుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఇదే జరుగుతోందని గతంలోనే తాము ఆధారాలతో సహా అనేక విషయాలు ప్రజలముందు ఉంచాము.

రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బందిగా చెప్పబడుతున్న ఐప్యాక్ సిబ్బంది సేవల్ని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన జీవోలకు ముందే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. 30-06-2020న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి ఇచ్చిన ఉత్తర్వుల్లో చాలా స్పష్టం గా అన్ని దినేశ్ మోరే అనే రామ్ ఇన్ ఫో సంస్థకు చెందిన అతను జిల్లాలోని వాలంటీర్ల పనితీరుని పర్యవేక్షిస్తారని, అతనికి జిల్లా యంత్రాంగం సహకరించాలని సూచిస్తూ, ఆదేశాలు ఇచ్చారు.

జగన్ సర్కార్ అధికారికంగా 2021 నుంచి రామ్ ఇన్ ఫో సిబ్బం దిని వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియమించినట్టు జీవోఇస్తే, దానికి ముందే 2020లోనే జిల్లా కలెక్టర్లు ఈ విధమైన ఆదేశాలు ఎలా ఇచ్చారు? అంటే జగన్ సర్కార్ జీవో ఇవ్వకముందు నుంచే ప్రైవేట్ కంపెనీ సిబ్బందిని వాలంటీర్లపై పెత్తనం చేయడాని కి నియమించిందని సుస్పష్టమవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవోలు ఇవ్వకుం డానే ప్రైవేట్ సంస్థను క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపి, వారి సేవల్ని వాలంటీర్ల సేవలతో అనుసంధానించినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బంది.. ఐ ప్యాక్ సిబ్బంది..ఒక్కరే
రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బందిగా చెప్పబడుతున్న సిబ్బందిలో ఎక్కువమంది ఐ ప్యాక్ సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పారు. వారిలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చెప్పిన దినేశ్ మోరే ఒకరు. వీళ్లంతా ఇలా ఒకసంస్థలో ఉంటూ మరోసంస్థలో పనిచేస్తున్నట్టు లింక్డ్ ఇన్ వెబ్ సైట్ సమాచారం ద్వారా తెలిసింది. దినేశ్ మోరే మాదిరే, చైతన్య.. ప్రవీణ్.. లాంటి వారుకూడా ఉన్నారు. వీరందరి కంటే అగ్రస్థానంలో ఉన్న జయేశ్ , పూర్ణ దుర్గ, షర్మిలా రెడ్డి, కృష్ణ గోపాల్ ఛత్రాహి, హిమాంతి కుమార్ లాంటి వాళ్లు ఐ ప్యాక్ లో 2018 నుంచే పనిచేస్తు న్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలా రామ్ ఇన్ ఫో సంస్థ, దాని అనుబంధ సంస్థ అయిన యూనికార్ప్ సొల్యూషన్స్ సంస్థలో ఐప్యాక్ లో పనిచేసేవాళ్లంతా ఒక్కటే.

ఐ ప్యాక్ సంస్థకు చెందిన సిబ్బందిని ముందే వాలంటీర్లపై పర్యవేక్షణ నిమిత్తం నియ మించిన జగన్ రెడ్డి సర్కార్…. ఆ తరువాత రామ్ ఇన్ ఫో, ఉపాధి ఇన్ ఫో టెక్, మాక్స్ డిటెక్టివ్ ఏజెన్సీ సంస్థలను కన్సార్టియంగా ఏర్పాటుచేసి, ఆ కన్సార్టియానికి వాలంటీర్లపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తరువాత తీరుబడిగా జీవోలు ఇచ్చింది. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కూడా చెల్లించేసింది. ఇదంతా ఎక్కడా బయటకు రాకుండా వైసీపీ సర్కార్ చాపకిందనీరులా మొత్తం వ్యవహారం చక్కబెట్టింది.

ప్రజలసొమ్ముని ఐ ప్యాక్ సంస్థకు దోచిపెట్టి.. సదరు సంస్థద్వారా తాను.. తన పార్టీ… తన ప్రభుత్వం పొందిన లబ్ధి ఏమిటో జగన్ రెడ్డి చెప్పాలి
మూడు సంస్థల్ని ఎఫ్.ఓ.ఏగా చెప్పిన జగన్ సర్కార్.. వాటి సేవల వినియోగం కోసం నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచిందా? టెండర్లు పిలిస్తే ఎల్-1, ఎల్-2, ఎల్-3 ఎవరు? రూ.274కోట్ల చెల్లింపులకు అసెంబ్లీ మరియు కేబినెట్ అనుమతి ఉందా? రామ్ ఇన్ ఫో సిబ్బంది… ఐ ప్యాక్ సిబ్బంది ఒక్కటేనని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం జీవో ఇవ్వకుండానే జిల్లా యంత్రాంగం రామ్ ఇన్ ఫో సిబ్బందికి ప్రభుత్వా ధికారుల సహకరించాలని ఎలా ఆదేశాలిచ్చింది? అలా ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిసి కలెకర్ట్ స్థాయి అధికారులు ఏ ధైర్యంతో ఆదేశాలు ఇచ్చారు?

ప్రభుత్వ ఉద్యోగులు రామ్ ఇన్ ఫో సంస్థ సిబ్బందికి ఎలాంటి సమాచారం అందించా రు.. అలా అందించిన సమాచారం ఎటుపోయింది..ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఆ సమాచారం మొత్తం ప్రైవేట్ సర్వర్లలో ఉందా..లేక ప్రభుత్వ సర్వర్లలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటిపై ముఖ్యమంత్రి తక్షణమే నోరు విప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది? వాలంటీర్ల సేవల పేరుతో ఒక ప్రైవేట సంస్థకు బాధ్యతలు అప్పగించి…అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు అందించడం ముమ్మాటికీ కుంభకోణమే. కాదని నిరూపించగల ధైర్యం ఈప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి ఉందా?

రూ.274 కోట్ల చెల్లిం పుల వ్యవహారంపై ఎలాంటి జీవోలు ఇవ్వకుండా జరపడాన్ని స్కామ్ అనక ఏమంటా ? ఇంత అడ్డగోలుగా జనం సొమ్ముని తన స్రప్రయోజనాలు.. తన పార్టీ ప్రయోజనాల కోసం ధారాదత్తం చేసిన జగన్ రెడ్డి, ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేని.. తప్పు జరిగిన ట్టు నిరూపించే రుజువులు లేని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో చంద్రబాబుని అకారణంగా దోషిని చేసే ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి? ఏమీలేని దానిలో ఏదోజరిగిందని చెబుతున్న ఈ నీతిమాలిన ప్రభుత్వం .. ప్రజల సొమ్ముని అప్పనంగా ఐ ప్యాక్ ఉద్యోగులకు దోచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటుంది?

తమ పార్టీ వారిని.. వాలంటీర్లుగా.. ఐ ప్యాక్ సిబ్బందిగా చూపుతూ.. వారి సేవల్ని తన పార్టీకి వినియోగించుకుంటూ, జగన్ రెడ్డి ప్రజల సొమ్ముని వారికి దోచిపెట్టి, వారి ద్వారా సేవలు పొందుతున్న ఈ వ్యవహారంలో ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నా యి. వాటిని కూడా త్వరలోనే బయటపెడతాం. ఇప్పుడు ప్రజలకు చెప్పింది ప్రజల సొమ్ముతో ఐ ప్యాక్ సంస్థ చేసిన సోకుల గురించే.. త్వరలో చెప్పబోయేది ‘డిజిటల్ కార్పొరేషన్ సొమ్ములు… వైసీపీ సోషల్ మీడియా సోకుల’ వ్యవహారం అని విజయ్ కుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE