– మంత్రి సవిత ఫైర్
అమరావతి : విశ్లేషణల పేరుతో తనకున్న విషపు మీడియాతో రాష్ట్రంలోని మహిళలను కించపరుస్తున్న జగన్ రెడ్డి కౌరవులను మించిపోయాడని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు.
కన్నతల్లిని, చెల్లెళ్లను కన్నీరు పెట్టిస్తున్న జగన్ రాష్ట్రంలో ఇతర మహిళలను కించపరుస్తూ రాక్షసానందం పొందుతున్నాడన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన మహిళలను కించపరచడం సిగ్గుచేటన్నారు. అమరావతిపై జగన్ కున్న అక్కుసును మహిళలపై వెళ్లగక్కడం సరికాదన్నారు.
కన్న తల్లిని, చెల్లెళ్లను సైతం కన్నీరు పెట్టిస్తున్న మూర్ఖుడు జగర్ రెడ్డి అన్నారు. కౌరవులను మించిపోయేలా జగన్ రెడ్డి మహిళలను వేధిస్తూ అరాచక శక్తిగా మారాడన్నారు. పౌర సమాజంలో జీవించే హక్కు జగన్ కోల్పోయాడన్నారు. అమరావతి మహిళలను కించపరిచేలా మీడియా విశ్లేషణ చేసిన సాక్షి చానల్ ను తక్షణమే బ్యాన్ చేయాలని మంత్రి కోరారు.
జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరిచిన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా పక్షపాత ప్రభుత్వం నడుస్తోందన్నారు. మహిళలు, బాలికల గురించి తప్పుగా మాట్లాడినా, వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడినా అటువంటి మృగాళ్లకు అదే చివరి రోజు అని మంత్రి సవిత హెచ్చరించారు.