వినాశక ఆంధ్రప్రదేశ్ గా జగన్ పాలన

– అభివృద్ధి చెందిన భారత దేశంగా మోడీ పాలన
– ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టడమే జగన్ నైజం
– వైసీపీ పార్టీలోనే తిరుగుబాటు
– రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్

విజయవాడ : రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ అందరినీ మోసం చేశారు. దేశంలో మోడీ తొమ్మిదనరేళ్లుగా, ఎపీలో జగన్ నాలుగున్నరేళ్లుగా పాలన చేస్తున్నారు. వికసిత్ భారత్ పేరుతో మోడీ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. జగన్ పాలన చూస్తే.. వినాశక ఆంధ్రప్రదేశ్ గా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి చెందిన భారత దేశంగా మోడీ పాలన సాగుతుంది. అదే ఏపీ మాత్రం నాలుగున్నరేళ్లల్లో ముప్పై యేళ్లు వెనక్కి తీసుకెళ్లారు.

జగన్ పాలన చూస్తే.. మరో ఇరవై యేళ్లు అయినా తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ప్రజలకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను పెంచేలా మోడీ పాలన సాగుతుంది. అందరినీ అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తూ.. మోడీ ప్రజలందరినీ సమ్మితులను చేస్తున్నారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా మోడీ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వికసిత్ సంకల్ప భారత్ యాత్ర పేరుతో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పధకాలను అందేలా చేశారు. దేశ వ్యాప్తంగా 2.60లక్షల గ్రామాలలో యాత్రలు చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు. అర్హత ఉండీ పధకాలు అందని వారు కూడా ఈ యాత్రలో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందేలా చేయడం చాలా గొప్ప విషయం.

ఈ నాలుగున్నరేళ్ళలో వైసీపీ పాలన చూస్తే.. వినాశక ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ… ప్రశ్నించే వారిని ఇబ్బందులు పెట్టడమే జగన్ నైజం. వచ్చే ముప్పై యేళ్లల్లో తిరిగి కోలుకోగలదా అనే విధంగా విధ్వంసకరమైన పాలన సాగుతుంది. జగన్ ఎంతసేపూ తన పేరు, తన తండ్రి పేరుతో పధకాలను అమలు చేస్తున్నారు. ఈ పధకాల కు సొమ్ములు జగన్ సొంతంగా ఇచ్చాడా… రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారా? కేంద్రం ఇచ్చే పధకాలకు సొంత డబ్బా కొట్టుకోవడం జగన్ కే చెల్లింది

ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులను జగన్ ఆదుకోలేదు.రాష్ట్రంలో ప్రజల నెత్తిన రెండున్నర లక్షల రూపాయలు అప్పు నెత్తిన వేశారు. పన్నెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్.. ఎలా తీరుస్తారు? ప్రతి ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. జగన్ మానసిక పుత్రికగా చెప్పుకునే వాలంటీర్లు కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కేంద్రం వేసే జాతీయ రహదారులు, రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.

నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పుకునే జగన్.. వారికి ఇచ్చే నిధులు దారి మళ్లించి వారి నోట్లో మట్టి కొట్టారు. కొత్త పరిశ్రమలు లేవు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. నీరు అందించే ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించేశారు. చేయాల్సిన పనులు చేయకుండా.. అనవసరపు పనలుకు నిధులు మళ్లించారు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ ది పూర్తిగా నిర్లక్ష్యమే.

విద్యుత్ ధరలు, పన్నుల భారాలతో ప్రజలను పీల్చుకు తింటున్నారు.వినాశక ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. మూడు రాజధానులు పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను కూడా నీరు గార్చారు. హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రాన్ని మూడు ముక్కలాటగా మార్చి.. మూడు ప్రాంతాల ప్రజలను దగా చేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని జగన్ చేత కాని పాలనతో వంచించారు.

వైసీపీ పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది.. జగన్ తప్పులను ఎత్తి చూపుతున్నారు. మోడీ రైతులకు ఇచ్చే ఆరు వేలను కలుపుకుని.. 13,500 తానే ఇస్తున్నట్లు జగన్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. రైతులకు 25వేలు ఇస్తామని చెప్పి.. జగన్ మోసం చేశారు. ఎరువుల సబ్సిడీ రెండు వేల వరకు కేంద్రం భరిస్తుంది.. జగన్ రైతులకు చేసింది శూన్యం. జాతీయ ఆహార భద్రత చట్టం కింద మోడీ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. దీనికి కూడా జగన్ తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేయడం దుర్మార్గం.

జల జీవన్ మిషన్ కింద కేంద్రం 9వేల కోట్లు ఇస్తే.. ఏపీ వాటాగా 9వేల కోట్లు ఎందుకు కేటాయించలేదు? ఆరోగ్య శ్రీ కింద 25లక్షల వైద్య సేవలు అంటూ జగన్ కొత్త నాటకం ప్రారంభించారు. విశ్వకర్మ యోజన కింద 13వేల కోట్ల తో చేతి వృత్తుల వారికి పని ముట్లు ఇఛ్చే కార్యక్రమానికి మోడీ శ్రీకారం చుట్టారు. ఇలా వినాశక ఏపీ గా జగన్ పాలన, వికసిక భారత్ గా మోడీ పాలనలు సాగుతున్నాయి. నూతన సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు లో వికసిక భారత్

Leave a Reply