టీడీపీ-జనసేన పొత్తుపై జగన్ కుయుక్తులు

– జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

సోషల్ మీడియా వేధికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్ రెడ్డి గోబెల్స్ ని మించిపోయాడు. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపులో నీచ రాజకీయానికి తెరలేపాడు. దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు సహించరని జగన్ రెడ్డి గుర్తించాలి.

టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వైసీపీ నేతలు నకిలీ లేఖ విడుదల చేశారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈ విషయాన్ని ప్రజలు, తెలుగుదేశం జనసేన శ్రేణులు నమ్మొద్దు. తప్పుడు ప్రచారాలతో బతికే జగన్ రెడ్డి తుప్పు వదిలించే జాబితా త్వరలో అధికారికంగా విడుదల చేస్తాం. అంత వరకు ప్రజలు పార్టీ శ్రేణులు జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి.

Leave a Reply