Suryaa.co.in

Telangana

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న వలసలు..

-బిజెపి కి షాక్ ఇస్తూ కారెక్కిన ఐదు గ్రామాల సర్పంచ్ లు
-ఒకే రోజు బిజెపి , కాంగ్రెస్ లను వీడిన పలు గ్రామాల సర్పంచ్ లు, సీనియర్ లీడర్లు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మునుగోడులో కూసుకుంట్ల విజయం ఖాయమనే ధీమాతో ఇతర పార్టీల ప్రజా ప్రతినిదులు టీ. ఆర్. ఎస్ లో చేరుతున్నారు. చండూరు మండలం లో జడ్పీటిసి కర్నాటి వెంకటేశం ఆధ్వర్యం లో ఐదు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు బిజెపి నీ వీడి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో లో టీ. ఆర్. ఎస్ లో చేశారు.

వీరిలో…చండూర్ మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్ , దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తుమ్మల పల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి లక్ష్మి సైదులు ఉన్నారు. మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత సత్యనారయణ గౌడ్ దంపతులు..వారితోపాటు మునుగోడు మండలం కిష్టాపురం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, సురిగి రాజు సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం లు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీ. ఆర్. ఎస్ లో చేరారు..వీరికి గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా..చండూరు జడ్పీటిసి కర్నాటి వెంకటేశం, మార్కెట్ వైస్ ఛైర్మెన్, మాజీ జడ్పీటీసీ జాజుల అంజయ్య గౌడ్, ఎంపిపి పల్లె కల్యాణి రవి గౌడ్, కైలాసం, సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE