Suryaa.co.in

Telangana

పదేళ్ల కేసీఆర్ పాలనలో సౌ’భాగ్యనగరం’.. కాంగ్రెస్ పాలనలో అ’భాగ్యనగరం’

– కూల్చడం కాదు … కట్టడం నేర్చుకోండి
– రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: పదేళ్ల కేసీఆర్ పాలనలో సౌ’భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ’భాగ్యనగరం’. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో తగ్గిన ఇండ్ల కొనుగోళ్లు. పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లు పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు. రియల్ ఢమాల్. ఇన్ఫ్రా సజీవ సమాధి.

మూసీ, హైడ్రా పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు. అమ్మకాలు జరగక ఆందోళనలో రియల్టర్లు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి!

హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 49 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు. ఆఫీస్ లీజింగ్ కూడా అధః పాతాళానికి. 2025 జనవరి – మార్చి మధ్య 41 శాతం తగ్గుదల. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణం. కూల్చడం కాదు … కట్టడం నేర్చుకోండి. అబద్దాలు చెప్పడం కాదు. అభివృద్ధి చేయడం నేర్చుకోండి.

LEAVE A RESPONSE