ఆస్తులను తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు

-రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యత
-రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం హౌసింగ్ విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయండి. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వండి.

రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తాం. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. వ్యవసాయం మా ప్రభుత్వం ప్రాధాన్యత. రుణాలు ఇచ్చే విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. ఫలితంగా ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలో విద్య రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయి. 20 ఏళ్లు అయినా ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదు.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు పంపిణీ చేసింది. తెలంగాణ ధనిక రాష్ట్రం బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించండి సంపదను సృష్టించండి రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది.

Leave a Reply