విజయవాడ : గన్నవరం మండలం ముస్తాబాదకు చెందిన ముస్తాబాద స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన బొబ్బా రత్నారావు మెమోరియల్ చెస్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు ఎంపి కేశినేని శివనాథ్ నగదు బహుమతులు అందజేశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో చెస్ అంతర్జాతీయ కోచ్ వీఆర్ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్ విజేతలు గురువారం కలిశారు.
విజేతలకు ఎంపి కేశినేని శివనాథ్ మొత్తం రూ.1,12,000 నగదు బహుమతులు అందజేశారు. ఈ చెస్ టోర్నమెంట్ లో చిరాగ్ కొమ్మినేని విజేత గా నిలిచారు. సెకండ్ విన్నర్ శౌర్య కొండూరు, థర్డ్ విన్నర్ గా హర్షిత సాయి గెలిచారు. మొదటి తరగతి చదివే విద్యార్ధులు రాఘ్విక్ యెర్నేని ప్రధమ బహుమతి, కెవల్ జైన్ ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి సహస్ర కొల్లి గెలిచారు.
మొదటి తరగతి నుంచి ఏడవ తరగతి నిర్వహించిన ఈ పోటీల్లో తరగతి వారీగా గెలిచిన విద్యార్ధులకు మొదటి,ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొబ్బా శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ ఎన్.సుజాతల తోపాటు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.