మెజారిటీ సీట్లు గెలిపించాలి

ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర సభ
కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం
తెలంగాణ కు సంబంధించిన పెండింగ్ పనులపై మ్యానిఫెస్టోలో చేర్చాలి
పీఈసీ సమావేశంలో ముఖ్యమంత్రి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పార్టీలో కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటికే పదవులు ఇస్తున్నట్టు సమాచారం ఇచ్చాము.. అన్ని అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు ఇచ్చాం.

రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్ పోస్టులలో పదవులు పొందిన వారిని అభినందిస్తూ తీర్మానం. ఏప్రిల్ 6న సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర సభ. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో ఉన్న 5 న్యాయ్ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంలో తెలంగాణ కు సంబంధించిన పెండింగ్ పనులపై మ్యానిఫెస్టోలో చేర్చాలి.

శ్రీధర్ బాబు నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీ కి ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వాలి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని మన జాతీయ నాయకత్వం మనకు కితాబు ఇవ్వడం మనకు గర్వకారణం. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించాలి. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. మనకు మంచి ఫలితాలు వస్తాయి.

 

Leave a Reply