-7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు విచారణకు హాజరు కావాలి
– విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు
– రఘురామ టార్చర్ కేసులో డాక్టర్ పద్మావతికి సుప్రీం హెచ్చరిక
ఢిల్లీ: నాటి నర్సాపురం ఎంపి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కె.విశ్వనాథమ్ ల ధర్మాసనం పద్మావతికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. డాక్టర్ ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదో ..ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సాక్షాలతో సహా కోర్టు ముందు ఉంచారు.