Home » వృద్ధులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాల్సిందే

వృద్ధులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాల్సిందే

-సీఎస్ బ్లాక్ ముందు కూటమి నేతల ధర్నా
-ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసిన కూటమి ముఖ్య నేతలు
-తొలుత 1వ తేదీనే వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలి
-సీఎం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు

వృద్ధులకు ఇళ్లవద్దనే పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్డీయే కూటమి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ … కూటమి కలిసి ఛీఫ్ సెక్రటరిని కలిశాము. గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సంబంధించిన బిల్లులు 13 వేల కోట్లు ఇచ్చేశారు. ఖజానా ఖాళీ చేశారు. ఏప్రిల్ 1, 2, 3 తేది సాయంత్రం వరకు సచివాలయాల వద్దకు, పెన్షన్లు ఇచ్చే అధికారుల వద్దకు గానీ డబ్బు చేరలేదు. దీంతో దాదాపు 33 మంది పెన్షన్ దారులు చనిపోయారు.

వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. ఒక మంత్రి చనిపోయిన వృద్ధురాలి శవాన్ని బయటికి తెచ్చి గలభ సృష్టించాలని జోగి రమేష్ ప్రయత్నించాడు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఈనెల 29, 30 కల్లా పెన్షన్ డబ్బులు ఇచ్చేవారు వారి వద్దకు మ్యాపింగ్ చేసి పంపాలి. మే 1వ తేది ఆరు గంటలకల్లా విలేజ్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి 20 మంది చొప్పున ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వాలి. ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలి. ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి, వైసీపీకి లబ్ధి చేకూర్చాలని ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారు.

ప్లాన్ చేసుకోకుండా, ఆలోచిస్తాం, చూస్తాం, మాట్లాడుతాం అంటున్నారే తప్ప మానవతా థృక్పథంతో సీఈసీ ఇచ్చిన ఆదేశాల్ని పాటించకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో జరిగిన దురదుష్ట సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఒకవేళ అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఛీఫ్ సెక్రటరి జవహర్ రెడ్డి సీబీఐ ఈడీ కేసులో సహ నిందితుడిగా ఉన్న సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి లు బాధ్యత వహించాలి.

జిల్లా కలెక్టర్లు బాధ్యతగా తీసుకోవాలి. ఉండే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఛీఫ్ సెక్రటరికి గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్ టు డోర్ పింఛన్ల పంపిణీ జరగాలి. చంద్రబాబుకూడా సీఈసీకి ఈ నెల 24 వ తేదిన లేఖ రాశారు. 26 వ తేది రాత్రి ఛీఫ్ సెక్రటరీకి ఆదేశాలొచ్చాయి. వచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. మరిన్ని మరణాలు సంభవించాలని చూస్తున్నారు. మీ దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టాలి. మే 1న 6 గంటలకల్లా పింఛన్లు బట్వాడా జరగాలని డిమాండ్ చేస్తున్నాం.

టీడీపీ పొలిట్ బ్యూరో వర్ల రామయ్య మాట్లాడుతూ … రాష్ట్రంలో గత ఐదేళ్లుగా రాక్షస పరిపాలన సాగుతోంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటికి కూడా ఇంకా అదే రాక్షస పాలన కొనసాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులం కలిసి అనుమతితో ఛీఫ్ సెక్రటరి వద్దకొచ్చాం. 1వ తేదీనే రాష్ట్రంలోని వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి. గతంలో మీ పొరపాటు, నిర్లక్ష్యం, అలక్ష్యం, తొంతరపాటుతనంవల్ల మీ దురుద్దేశంవల్ల, మీ దుర్మార్గపు ఆలోచనల వల్ల 33 మంది చనిపోయారు. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. అటువంటి అన్యాయం జరగటానికి వీల్లేదు. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి. ఇంతకు ముందు ఎలా పంపిణీ చేశారో ఆ విధంగానే పంపిణీ చేయాలి.

సిబ్బంది లేరనడం దుర్మార్గం. బోలెడుమంది సిబ్బంది ఉన్నారు. టీచర్స్ ఉన్నారు. సెర్ప్ లు ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వీరందరిచే పనులు చేయించాలి. సారా కొట్ల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం మీది. ఆ ఉపాధ్యాయుల్ని పెన్షన్ల పంపిణీకి ఉపయోగించరా? అని అడితితే ఆయన తెల్లముఖం వేశారు. ప్రభుత్వరంగంలో పనిచేస్తున్నవారి లిస్టు ఇచ్చాం. ఆ లిస్టు ప్రకారం డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్క పెన్షన్ దారుడు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు.

ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎప్పుడు జరిగే రీతిలోనే పెన్షన్ల పంపిణీ చేయమని కోరుచున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన రీతిలో పెన్షన్లు ఇవ్వాలి. ఆయన కర్ర విరగకుండా, పాము చావకుండా చాలాసేపు మమ్మల్ని కన్వీన్స్ చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ కు మేం చెప్పుకుంటామంటున్నారు. ఒక్క పెన్షన్ దారుడు కూడా ఇబ్బందిపడకూడదు. ఆయన వినే స్థితిలో లేరు. ఏదో ఇన్ఫ్లోయన్స్ కి గురైనట్లుగా ఆయన ముఖ కవళికలు మాకు కనబడుతున్నాయి.

మేం ధర్నా చేస్తుంటే మమ్మల్ని పోలీసులు లాగి అవతల పడేశారు. అయ్యా మీ తల్లి తండ్రులు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఎందుకు ఇబ్బంది అంటుంటే కూడా లెక్క చేయకుండా లాగి ఇక్కడ పడేశారు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. పెన్షన్ల తరపున పోరాటం చేస్తున్నాం, ఆరాటపడుతున్నాం. ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు. ఛీఫ్ సెక్రటరి చాలా నిర్లక్ష్యం వహించారు. ఒక్క ప్రాణం పోయినా ముఖ్యమంత్రి జగన్, ఛీఫ్ సెక్రటరీలే బాధ్యత వహించాలి.

శివశంకర్ (జనసేన)
ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరికి మేం రెప్రజంటేషన్ ఇచ్చాం. 1వ తేదిన ఇళ్లకు వెళ్లి పనిచేసే వ్యవస్థ ముందు ఉండింది. వాలంటీర్లు లేరనే నెపంతో 33 మంది చావుకు కారణమైంది ఈ ప్రభుత్వం ద్వంద నీతి. సరైన స్టాఫ్ లేదని చెబుతున్నారు. అనేక మంది ఉమెన్ అండ్ ఛైల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు. మండల ప్రజా పరిషత్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వీరందరిని ఉపయోగించి మళ్లీ ఒక్క చావు కూడా పునరావృతం కాకుండా చూడాలి.

సూర్యనారాయణ రాజు (బీజేపీ)
ఎన్డీయే పక్షాలైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల్ని కలిసి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలవటం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా రేపు 1వ తారీఖు వస్తోంది. అదే విధంగా 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ప్రభుత్వం ఆలోచిస్తాం, చూస్తామని చెబుతున్నారు. మాకు స్పష్టమైన హామీ కావాలి. ఈ ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు ఒకసారి గమనించాలి. జరగరాని ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లంక దినకర్, పిల్లి మాణిక్యరావు, మన్నవ సుబ్బారావు, బుచ్చి రాంప్రసాద్, ఏవి రమణ, కోడూరు అఖిల్, పాతర్ల రమేష్,మన్నవ వంశీ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply