Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లి ఈవీఎమ్ ను బద్దలు కొట్టినా ఎలాంటి చర్యలు లేవు?

-పోలింగ్ తర్వాత పిన్నెల్లి నాయకత్వంలో అల్లర్లు, అరాచకాలకు అంతు లేదు
-ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డ పిన్నెల్లి బ్రదర్స్
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ అతని అనుచరులు కలిసి దాడులకు తెగబడ్డారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ అరాచకాలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పోలీసులు వైసీపీ గూండాలకు అడ్డుచెప్పడం మానేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు.

పోలింగ్ రోజున పిన్నెల్లి స్వయంగా ఈవీఎమ్ ను బద్దలు కొట్టడం, టీడీపీకి ఓటు వేసిన సానుభూతి పరులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు వైసీపీ ఓటమి పాలవుతుందని భయంతో అరాచకాలకు సృష్టిస్తున్నరు. ఈ ఘటనలపై ఎన్నికల కమీషన్, పోలీసు వ్యవస్థ పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

LEAVE A RESPONSE