తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు 12వ రోజు కొనసాగాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. విశాఖ సౌత్ ఇంచార్జి గండి బాబ్జిని బీచ్ వద్దకు వెళ్ళనీయకుండా తన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ బీచ్ వద్ద 300 మంది మహిళా పోలీసుల మోహరించి ముగ్గురు ఏసీపీల నేతృత్వంలో విశాఖ బీచ్ దిగ్బంధం చేశారు. మరోవైపు నిరసన తెలుపుతున్న రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ను ఆర్కే బీచ్ లో అరెస్ట్ చేశారు. చంద్రబాబు ద్వారక తిరుమల మెట్లు మోకాళ్ళపై ఎక్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చైర్మన్ గొర్రెల శ్రీధర్ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మాడుగుల నియోజకవర్గానికి చెందిన కాళ్ళ నరసింగరావు (రాజు) ఉత్తరప్రదేశ్ లో కాశీ విశ్వేశ్వరుని గంగానదిలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జిల్లా తెలుగదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యక్రమలు జలదిక్షలో పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ దగ్గర ఉన్న శారదా నదిలో టీడీపీ నాయకులు జల దీక్ష చేపట్టారు. కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెవులు, నోరు, కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు వీరాంజనేయ స్వామి గుడి నుండి కామాక్షమ్మ దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. పడాల గంగాధర్ రక్తంతో సంతకం చేశారు. విశాఖలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. పెదవాల్తేరు జాలరిపేటలో వందల పడవలతో మత్స్యకారుల నిరసన తెలిపి చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని మత్స్యకారుల డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, గోరింట్ల బుచ్చియ్యచౌదరి, ఎన్.ఎం.డి ఫరూక్, రెడ్డెప్పగిరి శ్రీనివాసులు రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు కూనరవికుమార్, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కనకళ్ళ నారాయణ, నెట్టెం రాఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కాలవ శ్రీనివాసులు, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, నియోజవర్గాల ఇంఛార్జులు, మాజీ మంత్రులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.