Suryaa.co.in

Andhra Pradesh

తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి

త్వరలో అన్ని చెరువులకు నీటి నింపుతాం.
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం తహసీల్దార్ గారి కార్యాలయంలో ప్రజాదర్బార్ ను నిర్వహించిన మంత్రి సవిత

సోమందేపల్లి : తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవిత సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం తహసీల్దార్ వారి కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు ప్రజలు, నాయకుల నుంచి పలురకాల అర్జీలను మంత్రి స్వీకరించారు. అక్కడికక్కడే పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజాదర్బార్ లో వచ్చిన సమస్యలను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ఆరు నెలల్లోనే సిసి రోడ్లు డ్రైనేజీలు గోకులం షెడ్లు తో పాటు మరెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్లు పెంచాం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం త్వరలోనే తల్లికి వందనం ,మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం,రైతు భరోసా , కొత్త రేషన్ కార్డులుతో పాటు ,కొత్త పెన్షన్లు, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలు మంజూరు చేస్తామని అన్నారు.

LEAVE A RESPONSE