– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: రామోజీరావు లాంటి మహనీయుడు, ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధాకరమని, ఒక సామాన్య వ్యక్తి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ నివాళి అర్పించారు.
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఈనాడు సంస్థల ఎండి కిరణ్ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజాకిరణ్ ని, రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి ని, ఆయన మనవడు సుజయ్ ని రాజేంద్రప్రసాద్ పరామర్శించారు.
ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… నేను సారా ఉద్యమం, మధ్య నిషేధ ఉద్యమాలు చేసేటప్పుడు నాకు సలహాలు, సూచనలు ఇస్తూ స్ఫూర్తిగా నిలబడ్డారని, మా సర్పంచుల సంఘాన్ని కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించే వారని, అలాంటి మంచి వ్యక్తి లేని లోటు ఆ
ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి, చలపాటి శ్రీను, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.