బీజేపీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ రవికృష్ణ

– కండువా కప్పి ఆహ్వానించిన పురందేశ్వరి
– యువకులు పార్టీలో చేరాలని పిలుపు

విజయవాడ: ప్రవాస భారతీయుడు గొలగాని రవికృష్ణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన పురందేశ్వరి రవికృష్ణ నిర్ణయాన్ని ఆహ్వానించారు. యువకులు బీజేపీలో చేరాలని, దేశం యువకుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. యువకులను బీజేపీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, పనిచేసే వారికి బీజేపీలో గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

 

Leave a Reply