రికార్డు స్థాయిలో 770 రూట్‌ కిమీల విద్యుదీకరణ పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

`- ఇది జోన్‌చే ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ పనితీరు
– 2021`22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా సాధించని ఉత్తమ పనితీరు ఇది

దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో 2021`22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచి విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో జోన్‌ 770 రూట్‌ కిమీల రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ఇది జోన్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ రికార్డు. అంతేకాక 2021`22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా పూర్తి చేయని విధంగా దక్షిణ మధ్య రైల్వే అత్యధికంగా విద్యుదీకరణను పూర్తి చేసింది.

జోన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుదీకరణ పనులను వేగవంతంగా చేపట్టారు మరియు ముఖ్యంగా చివరి దశలలో ఉన్న పనులపై ప్రత్యేక దృషి పెట్టారు. మొత్తం 770 రూట్‌ కిమీలలో దక్షిణ మధ్య రైల్వే
railway2 పరిధిలోని తెలంగాణలో 326 కిమీలు, ఆంధ్రప్రదేశ్‌లో 331 కిమీలు, మహారాష్ట్రóలో 87 కిమీలు మరియు కర్ణాటకలో 27 కిమీలు ఉన్నాయి. 2021`22 సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పూర్తి చేసిన విద్యుదీకరణ పనులు క్రింది విధంగా ఉన్నాయి :
` దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 326 కిమీల విద్యుదీకరణలో 85.60 కిమీల ఉందానగర్‌ ` మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యింది. 57.70 కిమీల గద్వాల్‌ ` రాయచూర్‌Ñ 45.10 కిమీల మోర్తాడ్‌ ` నిజామాబాద్‌ విద్యుదీకరణ పూర్తితో లింగంపేట జగిత్యాల ` నిజామాబాద్‌ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయ్యింది. 25.85 కిమీల నిజామాబాద్‌ ` బోధన్‌ Ñ 37.55 కిమీల భద్రాచలం ` భవనపాలెంÑ 40.13 కిమీలు పింపల్‌కుట్టి ` కోసాయి (తెలంగాణ భాగం)Ñ 33.72 కిమీలు కోహిర్‌ డక్కన్‌ ` ఖానాపూర్‌ (తెలంగాణ భాగం) విద్యుదీకరణ పూర్తయ్యింది.

` దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి సంబంధించిన 331 కిమీల విద్యుదీకరణలో 45.53 కిమీల ఆరవల్లి ` భీమవరం ` నర్సాపూర్‌Ñ కదిరి ` తుమ్మనంగుట్ట మధ్య 53.30 కిమీలుÑ పాకాల ` కలికిరి మధ్య 55.80 కిమీలు, ఢోన్‌ ` కర్నూలు సిటీ మధ్య 54.20 కిమీలు, ఎర్రగుంట్ల ` నంద్యాల మధ్య 122.32 కిమీలు ఉన్నాయి.

` దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన 87 కిమీల విద్యుదీకరణలో 45.30 కిమీల లోహోగడ్‌ ` వాసింÑ 37.15 కిమీల ఆంకాయ్‌ ` రోటేగావ్‌ మరియు పింపల్‌కుట్టి ` కోసాయి మధ్య 4.17 కిమీలు ఉన్నాయి.

` దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన 26 కిమీల విద్యుదీకరణ కోహిర్‌ డక్కన్‌ ` ఖానాపూర్‌ మధ్య జరిగింది.

రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైలు ఇంజన్‌ మార్పు చేయవలసిన అవసరం లేకపోవడంతో నిరాటంకంగా రైళ్లను నడపవచ్చు, మార్గ మధ్యలో ప్రయాణికుల మరియు సరుకు రవాణా రైళ్ల నిరీక్షణను తగ్గించే అవకాశాలు ఉండడంతో రైళ్ల సగటు వేగం మెరుగవుతుంది. సెక్షనల్‌ సామర్థ్యం మెరుగవడంతో ఈ సెక్షన్లలో మరిన్ని రైళ్లను నడిపించడానికి అవకాశాలు పెరుగుతాయి. దీంతో పర్యావరణ పరిరక్షణ కూడా ఏర్పడుతుంది, అంతేకాక ఇదే సమయంలో ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతుంది.

విద్యుదీకరణ పనుల నిర్వహణలో అంకితభావంతో శ్రమించిన జోన్‌ సిబ్బంది మరియు అధికారుల బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు. సంబంధిత ప్రాజెక్టుల విద్యుదీకరణ పనులలో రైల్వే మరియు రైల్వే విద్యుదీకరణ సిబ్బంది సమన్వయంతో సహాయ సహకారాలను అందిపుచ్చుకోవడంపై కూడా జనరల్‌ మేనేజర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లో అధిక భాగం విద్యుదీకరించబడిరదని మరియు ఇది రాబోయే సంవత్సరాల్లో జోన్‌ 100 శాతం విద్యుదీకరణను సాధించడంలో తోడ్పడుతుందని ఆయన అన్నారు.

Leave a Reply