Suryaa.co.in

Andhra Pradesh

రొట్టెల పండుగ నిర్వహణలో శ్రీధర్ రెడ్డి అట్టర్ ఫ్లాప్

  • దేవుడి కార్యం నీతి నిజాయితీతో చేయాలి కుట్రలు కుతంత్రాలతో కాదు….
  • రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి…
  • గతంలో బారాషాహీద్ దర్గా అభివృద్ధి కోసం 20 కోట్లు మంజూరు చేశాం…
  • రొట్టెల పండుగకు జనాలు రాక వ్యాపారులు పాట పాడిన వారు నష్టపోయారు…
  • టిడిపి అధికారంలోకి వస్తే అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా బారాషాహిద్ దర్గాను తయారు చేస్తాం..
  • – సోమిరెడ్డి, అజీజ్…

నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోవూరు నియజకవర్గ ఇంఛార్జి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గం ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, మాజీ కార్పొరేటర్ దొడ్డపనేనీ రాజా నాయుడు లు బారాషహీద్ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు..

అనంతరం బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువులో 2023 ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలనీ ఆకాంక్షిస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్ లు రొట్టె మార్చుకున్నారు…ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, బాబు సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ రొట్టె పట్టినట్లు తెలిపారు.రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని రంగాల్లో దోపిడీకి దౌర్జన్యాలకి గురవుతున్నాయని తెలిపారు. ఎందరో వీరుల పోరాటంతో మనకు స్వాతంత్రం వచ్చిందని మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతుందని, వైసిపి పాలన ఏర్పడిన ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎవరు స్వతంత్రంగా బతికే పరిస్థితులు లేవని పోలీసుల దయాదాక్షిన్యాలపై బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ నారా చంద్రబాబునాయుడు పై ఉంటాయన్న నమ్మకం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ…
వైసీపీ నేతలు ఏ పని చేసినా అందులో నీతి నిజాయితీ కరువైందని అందుకు ఉదాహరణ ఈ రొట్టెల పండుగేనని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రొట్టెల పండుగకు రాష్ట్ర పండుగ గుర్తింపు తీసుకొని వచ్చామని మరి కొంత సమయం ఉండి ఉంటే జాతీయ పండుగ గుర్తింపు తీసుకుని వచ్చే వారమని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చేవారని, ఇక్కడ మహిళలు బహిరంగ మలమూత్ర విసర్జనలు బహిరంగ స్నానాలు చేసే వారని వారికోసం టిడిపి హయాంలో 120 శాశ్వత టాయిలెట్లను నిర్మించామని తెలిపారు.

బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి, 8 కోట్ల రూపాయలతో ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని దాదాపు రెండు కోట్ల రూపాయలతో పిల్లర్లు వేసిన తర్వాత కూడా వైసీపీ వారు ఆ పనిని అర్ధాంతరంగా ఆపేసారని తెలిపారు. గతంలో టిడిపి హయాంలో మంజూరు చేసిన 20 కోట్ల రూపాయలను తుంగలో తొక్కి ఈ మూడేళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకొని రాకుండా ఇప్పుడు మా స్వాతిముత్యం కమలహాసన్ ఒక కాగితం పట్టుకొని 15 కోట్లు తెచ్చినట్లు ప్రగల్బాలు పలుకుతున్నారని తెలిపారు. దేవుడి విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని టీడీపీ హయాంలో చేసిన పనులు ఆపేయడం సరికాదని తెలిపారు.

గతంలో మేము రొట్టెల పండుగ నిర్వహించేటప్పుడు 16.5 లక్షల మంది వచ్చినట్లు ఓల్డ్ రికార్డు ప్రకటిస్తే, నేను కనీసం మూడు నాలుగు లక్షల మంది వచ్చిన దాఖలాలు కూడా లేవని అన్నారు. జనాలని ఇబ్బంది పెట్టకూడదని మిట్టమధ్యాహ్నం వచ్చామని, మేము వచ్చేసరికి ఇక్కడ ఎవరూ లేరని, ప్రజలకంటే పోలీసుల్ని ఎక్కువ మందిని పెట్టి ఉన్నారని తెలిపారు. దేవుడి కార్యం మంచి మనసుతో నిర్వహించాలని, కుతంత్రాలతో నిర్వహిస్తే ఇలానే ఉంటుందని ప్రజలు కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదని తెలిపారు. దుకాణదారులను అడిగిన పాట పాడిన వారిని అడిగిన జనాలు రాక నష్టపోయామని వాపోతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా బారాషాహిద్ దర్గాను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…

LEAVE A RESPONSE