గుంటుపల్లి నాగేశ్వరరావు ఆకస్మిక మృతికి టీడీపీ నేతల సంతాపం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షులు గుంటుపల్లి నాగేశ్వరరావు అకాల మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు. కేంద్ర కార్యాలయంలో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ కోసం తపించారు. అదే సమయంలో బీసీ వర్గాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇక లేరని ఆలోచించడానికి కూడా కష్టంగా ఉందని శాసనమండలి మాజీ సభ్యులు టి.డి.జనార్ధన్, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ పేర్కొన్నారు. నాగేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియో కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, వడ్డెర సాధికార సమితి నాయకులు ఈశ్వర్, అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, హెచ్ఆర్డీ సభ్యులు ఎస్పీ సాహెబ్, ఆహ్వాన కమిటీ సభ్యుడు హసన్ బాష, మైనార్టీ సాధికార సమితి కన్వీనర్ బేగ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంతాపం తెలిపారు.

Leave a Reply