Suryaa.co.in

Andhra Pradesh

కోనుప్పలపాడు గ్రామస్థులకు టీడీపీ అండ

– ఎమ్మెల్సీ, నారా లోకేష్

అనంతపురం జిల్లా (తాడిపత్రి) : అనంతపురం జిల్లా కోనుప్పలపాడు గ్రామ సర్పంచ్ భర్త రామాంజనేయులును పోలీసులు హింసించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ స్పందించారు.కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని విమర్శించారు. శాంతి భద్రతలు గాలికొదిలి టీడీపీ కార్యకర్తల తలలు పగలకొట్టడం, సామాన్యులను చిత్రహింసలకు గురిచేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

డీజీపీ స్పందించాలి
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో టీడీపీ సర్పంచ్ భర్త రామాంజనేయులును యానిమేటర్‌గా రాజీనామా చేయాలని వైసీపీ నేతలు బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో రామాంజనేయులుతో సహా మరో ఆరుగురు గ్రామస్థుల‌పై కేసులు బనాయించారు.
స్వయంగా తాడిపత్రి డీఎస్పీ రంగంలోకి దిగి బోయ సామాజికవర్గానికి చెందిన నాగార్జున, సింహాద్రి‌తో పాటు మరో నలుగురు‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.చేతి వేళ్ళు విరిగి రక్తం కారే వరకూ హింసించారు.గ్రామస్థుల‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసుల‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నా అని నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE