Suryaa.co.in

Telangana

ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది.

– పంటలకు బోనస్ ఇవ్వడం లేదు
– కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా బిజెపి నాయకులు జిల్లాల వారీగా పర్యటిస్తూ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అసెంబ్లీ వేదికగా బిజెపి శాసనసభ్యులు రైతుల సమస్యలపై ప్రస్తావిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది.

ఎన్నికల వేళ ప్రత్యేక బీమాతో పంటల బీమా పథకం తీసుకొస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రైతుల ప్రయోజనాల కోసం బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు, రైతులకు ప్రయోజనాల కోసం బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సుమారు 8 జిల్లా కలెక్టర్‌ల దగ్గర రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం.

మార్చి 28వ తేదీన ఉమ్మడి జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ఉ. 10 గం.ల నుంచి మ. 2 గం.ల వరకు రైతు సత్యాగ్రహ దీక్ష చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తికాలేదు, రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదు, కౌలు రైతులకు సాయం మాటలకే పరిమితమైంది, పంటలకు బోనస్ ఇవ్వడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తోంది. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో కుస్తీ పడినట్లు నటిస్తూ, స్టాలిన్ ఇంట్లో దోస్తీ కట్టాయి. కేటీఆర్ కు రాములవారి తలంబ్రాలకు, అక్షింతలకు తేడా తెలియకుండా హేళనగా, హిందూ సమాజాన్ని అవమానించేలా మాట్లాడుతున్నరు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను చర్చకు రాకుండా చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతూ, ప్రజాదృష్టిని మరల్చుతోంది.

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షాన కొట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంతవరకు, రైతుల పక్షాన శాంతియుతంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం.

LEAVE A RESPONSE