– వక్ఫ్ భూముల్లో ఎన్ని స్కూళ్లు, అనాథాశ్రమాలు, నైపుణ్య కేంద్రాలు, ఆసుపత్రులు నిర్మించారు?
– ఇంకా ఓట్ల వ్యాపారం ఎందుకు?
– రాజ్యాంగం బుక్ పట్టుకోవడం ప్యాషనయింది
– లోక్‌సభలో కాంగ్రెస్‌ను కడిగేసిన కేంద్రమాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఢిల్లీ: దశాబ్దాల నుంచి కాంగ్రెస్ అనుసరిస్తున్న సంతుష్టీకరణ రాజకీయాలపై బీజేపీ సీనియర్ఎంపి, కేంద్రమాజీ మంత్రి లోక్‌సభలో కడిగిపారేశారు. వెనుకబడిన ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లు ను తెచ్చామని.. తక్కువ సీట్లకు పరిమితమైనప్పటికీ, కాంగ్రెస్ ఇంకా ఓటు రాజకీయాలను విడనాడలేదని విరుచుపడ్డారు. వక్ఫ్ బోర్డు మతపరమైన సంస్థ కాదని, చట్టబద్ధమైన సంస్థ అని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ అనివార్యతల కారణంగానే విపక్షాలు వక్ఫ్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.
రవిశంకర్ ప్రసాద్ ఏమన్నారంటే..రాజ్యాంగం రెడ్ కాపీని చేత్తో పట్టుకుని తేవడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ, ఇక్కడే పార్లమెంటులోని ”గ్రీన్ కాన్‌స్టిట్యూషన్” బుక్ నా వద్ద ఉంది. మహిళల సంక్షేమానికి చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెబుతోంది. అప్పుడు ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంది? ఈ బిల్లు వెనుకబడి ముస్లింల స్థితిని మెరుగుపరేచేందుకు ఉద్దేశించినది.
రాజ్యాంగాన్ని చూపిస్తూ ఆర్గుమెంట్ చేసే విపక్షాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలతోనే నేను సమాధానిమిస్తున్నా. వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ. దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఎన్ని స్కూళ్లు, అనాథాశ్రమాలు, నైపుణ్య కేంద్రాలు, ఆసుపత్రులు నిర్మించారు? సంస్కరణలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు విపక్షాలు చెబుతున్నప్పటికీ, రాజకీయ అనివార్యతల కారణంగానే సంస్కరణలను విభేదిస్తు్న్నాయి.
370వ అధికరణను రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా హింసకు దారితీయవచ్చని విపక్షాలు వాదించాయి. కానీ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో అభివృద్ధి జరిగింది. ఉద్యోగావకాశాలు కలిగాయి.
ముస్లిం కమ్యూనిటీ ఆదర్శాలు అబ్దుల్ కలాం ఆజాద్, ఏపీజే అబ్దుల్ కలామ్, అష్పఖ్ ఉల్లా ఖాన్, మొహమ్మది షమి తరహాలో ఉండాలి. 25-30 ఏళ్ల తర్వాత ఓట్ల వ్యాపారం మానేయాలని మనం ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన నుంచి విపక్షాలు బయటకు రావడం లేదు. దేశం మారుతుంటే కాంగ్రెస్ చూస్తుండిపోయింది. వాళ్లు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎన్ని సీట్లకు పరిమితమయ్యారు?