– ఆగస్టు నుంచి కొత్త చార్జీలు అమల్లోకి
-మీడియాతో కమీషన్ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
తిరుపతి : ఇష్టం లేకపోయినా, కష్టంగానే,, విద్యుత్ చార్జీలు పెంచుతున్నాము…అందరూ అర్థం చేసుకోవాలి.చాలా ఏళ్ల నుంచి ధరలు పెంచలేదు. డిస్కంల మనుగడ, వినియోగదారుల ప్రయోజనాలు పరిగణలోకి తీసుకొని పెంచుతున్నాము. దేశమంతా బొగ్గుకు కొరత ఉంది. డబ్బులు పెట్టి కొనాలనుకున్నా లభించ లేని దుస్థితి నెలకొని ఉంది.ఈ పరిస్థితుల్లోనే మరీ భారం పడకుండా, సామాన్యులపై భారం వేస్తున్నాము.సోలార్, విండ్ ఉత్పత్తికి కూడా అధిక ఉంటుంది అనివార్యంగా మారింది.జాతీయ విద్యుత్ టారీఫ్ విధానాన్ని అనుసరించే చార్జీలు పెంచాము…డిస్కంల తనకు కొంత భిన్నంగానే పెంచాము.డిస్కంలు అడిగిన దానికన్నా 300 నుంచి 400 కోట్ల రూపాయలు అదనంగా సమకూరేలా పెంచుతున్నాను.పీపీఏలు సమకూర్చుకోవడానికి కావలసిన నిధులు డిస్కంల వద్ద లేదు.మేము సంతోషంతో ఈ ధరలు పెంచడం లేదు.పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం లేదా…. ఏవి పెరగడం లేదో చెప్పండి.అనేక కారణాల వల్ల డిస్కంలు నష్టంలో ఉన్నాయి. మూడు డిస్కంలు దేశంలో ఉన్న ఏ డిస్కంలకు తీసిపోని విధంగా పని చేస్తున్నాయి.