సీమ సం‘గతే’మిటి సారూ?!

అందరూ ఒక్కటై 52 సీట్లకు గాను 49 సీట్లు వైసీపీకి కట్టబెట్టిన రాయలసీమలో.. సీమ బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ప్రధాన సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా.. అందరూ ఒక్కటై నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఇంట్లో, బయట, సింకు అన్నాడు. సిద్ధాంతాల మధ్య యుద్ధం అన్నాడు.

ఇలా తనపై సెంటిమెంటు కురిపించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్, తాను పుట్టిన సీమకు.. తనను సీఎంను చేసిన సీమకు ఏం చేశారో మాత్రం, ఇప్పటిదాకా ఒక్క వేదిపైనా చెప్పకపోవడమే వింత. జగన్ పట్టించుకోని.. పల్లెత్తు ప్రస్తావించని సీమ రోదన ఓసారి చూద్దాం.

* రాయలసీమ నీటి సమస్య గురించి ఒక్క మాట లేదు.
* సీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం గురించి డైలాగులు లేవు.
* 102 ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఎందుకు ప్రీక్లోజర్ అయ్యయో తెలియదు.
* సొంత జిల్లాల్లో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు.
* డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు ఎత్తేసావు అంటే సమాధానం రాలేదు.
* కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందో చెప్పలేదు.
* కర్నూల్ మెగా సీడ్‌ పార్క్‌ ఎందుకు వెళ్ళిపోయిందో చెప్పలేదు.
* పది వేల మందికి ఉపాధిని ఇచ్చే అమర్ రాజాని ఎందుకు గెంటేసాడో చెప్పలేదు.
* జాకీ కంపెనీ ఎందుకు వెళ్లిపోయిందో చెప్పలేదు.
* పెద్దిరెడ్డి కొట్టేస్తున్న కొండల గురించి మాట్లాడలేదు.
* పనులు లేక సీమ ప్రజలు వలస వెళ్తుంటే, సమాధానం ఉండదు.
* హంద్రీ నీవా, గాలేరు నగిరి ఏమైందో స్టేటస్ లేదు.
* అన్నిటికీ మించి, సీమలో(కర్నూల్) పెట్టే న్యాయ రాజధాని అడ్రెస్ చెప్పలేదు !

– ప్రదీప్
నందిగామ

Leave a Reply