Suryaa.co.in

Features

అంబేడ్కర్ ఫోటోనే ఎందుకు పెట్టాలి?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సవంత్సరం అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు.

జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయ్యి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది మన దేశ విధివిధానాల రూపకల్పన లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌‌ను ఎన్నికోగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌‌ను నియమించారు.

రాజ్యాంగ రచన ప్రజాస్వామ్య విధానంలో ఉండేలా భిన్నత్వ ప్రజలలోని సమానత్వ భావనను పెపొందించేలా చివరి వరకు తానే బాధ్యత గా తీసుకుని ప్రపంచ దేశాలకే ఆదర్శమైన అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.

బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు.
భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది
కుల, మత, లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించారు. అలాగే ప్రతి పౌరుడు దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నింటకీ గుర్తుచేసుకుంటా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతీ పౌరుడు హక్కులను ఉపయోగించుకుంటూ, బాధ్యతలను విస్మరించకుండా దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలని, అలాగే ప్రతి చోట బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో జెండా వందన కార్యక్రమంలో ఉంచాలని కోరుకుంటూ ….

– బిఎస్

LEAVE A RESPONSE