టీడీపీలో చేరిన వైసీపీ యువజన విభాగం నేత సుభాని

– పసుపుకండువా కప్పి ఆహ్వానించిన యువనేత లోకేష్

ఉండవల్లి : మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు యువనేత లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ అధ్వర్యంలో మంగళగిరి పట్టణ వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, మరో 60 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. వీరికి యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply