– కొలంబో ట్రస్ట్ రాజారపు ప్రతాప్
సికింద్రాబాద్ ఆర్చ్ బిషప్ హౌస్ లో ప్రముఖ కొలంబో ట్రస్ట్ ఫౌండర్, మైనారిటీ కమిషన్ ప్రతిపాదిత వైస్ చైర్మన్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో పలువురు ఇండిపెండెంట్ చర్చి బిషప్ లు, పాస్టర్లు, దళిత సంఘాల నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, క్రైస్తవ నాయకులు, దళిత మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులతో క్యాధలిక్ చర్చి కార్డినల్ పూల ఆంథోని ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై, విద్యా వైద్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డినామినేషన్ ఇండిపెండెంట్ చర్చిలను, దళిత క్రైస్తవ నాయకులను ఐక్యం చేసి బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని , గతంలో ముఖ్యమంత్రి కె సి ఆర్ 200 మంది బిషప్ లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని రాజారపు ప్రతాప్ కి సూచించారని , అదే క్రమంలో త్వరలో ఫూల ఆంథోనీ ని ప్రభుత్వ పరంగా అధికారికంగా సన్మానించే కార్యక్రమం భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
సి యం గతంలో ప్రతాప్ కు ఇచ్చిన హామి ప్రకారం సుమారు 200మంది బిషప్ లు, దళిత క్రైస్తవ మేధావులు, ప్రొఫెసర్లు, అడ్వకేట్ లు, సైంటిస్ట్ లు, క్రిస్టియన్ ఎన్ జి వో లు, తెలంగాణ క్రైస్తవ ఉద్యమకారులు, దళిత నాయకులతో కలిసి రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో త్వరలో ముఖ్యమంత్రి ని ప్రగతి భవన్ కలిసే ఏర్పాట్లపై చర్చించారు.
ప్రస్తుతం ఉన్న తెలుగు ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ సహకారంతో పలు క్రైస్తవ అంశాలు, సంక్షేమం నామినేటెడ్ పదవుల నియామకం గురించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని సియం కి వీలైతే .. ఏప్రిల్ 30 లోగా సమావేశం నిర్వహించాలని పూలే ఆంథోని సూచించారు.
అనంతరం బిషప్ పూల ఆంథోని ప్రతాప్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఇండిపెండెంట్ బిషప్ లు నాయకులందరూ కలిసి కార్డినల్ పూల ను శాలువా కప్పి, పూల బొకెతో ఘణంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బిషప్ విల్సన్ సింగం, బిషప్ భాస్కర్ ముల్కల, బిషప్ దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ షీ టీం. రాజారత్నం, ప్రొఫెసర్ మురళి దర్శన్, కిరణ్, మానవహక్కుల కమిటీ బృందం పాల్గొన్నారు.