ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి

– ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య డిమాండ్

తెలుగు ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన స్వర్గీయ ఎన్.టి.రామారావు కు భారతరత్న బిరుదు ప్రకటించాలని. ఎమ్మెల్సీ రామచంద్రయ్య సంతకం చేసి తన సంఘీభావం ప్రకటించారు.

జనవరి 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నగరానికి చెందిన ఆర్కే రాయల్ కరిములా, ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కు భారతరత్న బిరుదు ఇవ్వాలని పోస్ట్ కార్డు ద్వారా సంతకాల సేకరణ చేసి అవి భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్మాకు పంపే కార్యక్రమము చేపట్టారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య. టిడిపి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ అమీర్ బాబు. టిడిపి నాయకులు జి లక్ష్మిరెడ్డి. మహిళా కార్పొరేటర్ ఉమాదేవి. దుర్గాప్రసాద్. పోస్ట్ కార్డులపై తమ సంతకాలను చేసి తమ సంఘీభావం తెలిపారు.

Leave a Reply