కంచిలో బంగారు బల్లి కథ

బంగారు బల్లి అంటే ఎవరికైనా యిట్టె గుర్తొచ్చేది తమిళనాడులోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయం. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే, దోషం వెళ్లి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాధ ఉంది. అదేమిటంటే గౌతమ మహర్షి కి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఎప్పటిలాగే శిష్యులు కుండ పట్టుకొని నది తీరానికి వెళ్లి, నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది. వారు చూసుకోలేదు. దీన్ని…

Read More

సత్ సాంగత్యం

అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన మాటలు అత్యంత విలువైనవి. అందరూ గుర్తుంచు కోవలసినవి. ఆచరించవలసినవి. అదే ఉద్ధవగీత గా చెప్పబడుతోంది. ఆయన అంటాడు ‘ఉద్ధవా! నీవు నాకు సేవకుడవు, సఖుడవు, సహృదయుడవు. నీకొక రహస్యమైన విషయమును చెప్పెదను, వినుము. సత్సంగం అనేది లోకంలో అన్ని విధాలైన ఆసక్తులను నశింపచేస్తుంది. యోగము, సాంఖ్యము, అనుష్టానము, స్వాధ్యాయము, తపస్సు, సన్యాసము, యజ్ఞయాగాదులు, వివిధములైన వైదిక కర్మలు, వ్రతాలు, పూజలు, రహస్యమగు మంత్రాలు, హోమనియమాలు, తీర్థయాత్రలు మున్నగు వాటన్నిటికన్నా…

Read More

ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి?

ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం. శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి…

Read More

గోసేవకు వరం

ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటు ఈ లోకం లో ఆ భక్తురాలు ఉండేది ఒక పూరి గుడిసెలో..! ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి…

Read More

ధన్వంతరి జయంతి

శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం ,…

Read More

వారణాశిలో దీపావళి

ఉత్తరప్రదేశ్ లోని అతి మహిమాన్విత శైవక్షేత్రం వారణాశి. దీపావళీ పర్వదినాన ఈ నగరమంతా దేదీప్యమానమై కళకళలాడుతూంటుంది.పవిత్ర గంగ ఒడ్డున వున్న 64 తీర్ధ ఘట్టాలలో మణికర్ణికా ఘట్టం అత్యంత పునీతమైనది. అమ్మవారి మణికర్ణాభరణం,పరమశివుని కర్ణాభరణం గంగాతీర స్నానఘట్టంలోని బావిలో పడినవి. అవి రెండూ కలిసి శివలింగ రూపాన బయటికి వచ్చాయి.ఆ లింగమే మణికర్ణికేశ్వరునిగా పూజింపబడుతున్నది. ఇక్కడ మణికర్ణికా అమ్మవారు కొలువై వున్నారు. అప్పటినుండే ఈ స్నాన ఘట్టం మణికర్ణికా ఘట్టంగా కీర్తించబడుతోంది. ఈ మణికర్ణికా ఘాట్ లో…

Read More

కుజదోషం బాధ పెడుతోందా?తేలికైన నివారణ మార్గం!

కుజ దోషం ఉంటే పెళ్లి కాదా? ఏం చేయాలి? కుజ దోషం వలన వివాహం మాత్రమే సమస్య ? ఇంకా ఇతర ఇబ్బందులు ఉంటాయా ? పరిష్కార మార్గము ఏమిటి ? ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం, స్వభావం వంటి వాటిని కుజుడు సూచిస్తాడు. బర్త్ చార్ట్ లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దూకుడు స్వభావం కలిగి ఉండటం, స్వభావంలో సమస్యలు ఎదురవుతాయి. ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12…

Read More

కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర…

Read More

ప్రత్యక్ష నారాయణా ఏలుకో

(డాll పార్నంది రామకృష్ణ) దినకరుడు దిగంతాలను వెలిగించాడు. శుభకరుడు పల్లెపల్లెకూ శోభ తెచ్చాడు. సస్యలక్షి కదలి వస్తుంటే ఊరూవాడా ఆనందరాగాలు ఆలపించాయి. పచ్చని పొదరిళ్ళు, ఆనందాల హరివిల్లు, కనువిందు చేస్తున్న గ్రామసీమలు… ఇంత ఆనందానికి కారణమైన సూర్యభగవానుడికి జ్యోతలు, ప్రణతులు. నిప్పురవ్వలు కురిపించినా.. నిదానంగా ప్రభవించినా.. జగత్తుకు మేలు చేయడమే సూర్యభగవానుడి విధి. అలసట రాదు.. ఆగిపోవడాలు ఉండవు.. అలిగి వెనుదిరగడాలు అస్సలు కనిపించవు.. యుగయుగాలుగా పయనిస్తూనే ఉన్నాడు. నిజరూపంతో రుజుమార్గంలో అలుపెరగకుండా సంచరిస్తూనే ఉన్నాడు. వేసవిలో…

Read More

శ్రీ ఆంజనేయ మహాత్మ్యం

బ్రహ్మ దేవుని చరిత్రం శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో గంధ మాదన పర్వతం మీద సుఖంగా వున్నాడు .శ్రీ రామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ ,శ్రీ రామ నామ పానాన్ని అనుభవ సిస్తున్నాడు .అయినా ఒక రోజూ ఆయనకు శ్రీ రామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది .అంతే వెంటనే బయల్దేరి గంధ మాదనం నుంచి బయల్దేరి అయోధ్యకు చేరాడు .శ్రీ రాముని సందర్శించి భక్తీ ,వినయంతో నమస్కరించి స్తుతి చేసి ,ఆయన మనస్సును గెలిచాడు .అప్పుడు…

Read More