Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

కుప్పంలోని బాబు నగర్ లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ ప్రచారంలో భాగంగా మంగళవారం చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోయే సూపర్-6 పథకాలను గురించి మహిళలకు వివరించారు. ఈ ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రబాబు వద్ద మహిళలు ఏకరవుపెట్టారు. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

టీడీపీకి అనుకూలమన్న ఉద్దేశ్యంతో తమ పెన్షన్లు తొలగించారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంరద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…తమ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని, రెండు నెలలు ఓపిక పట్టాలని సూచించారు. అకారణంగా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం నిలిపేసిన సంక్షేమ పథకాలను తిరిగి అందిస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE