Suryaa.co.in

Features

హిందువులలో నాలుగు రకాలు

1. నామ మాత్ర హిందువు: పేరుకు హిందువేగాని హిందూ ధర్మం గురించి పెద్దగా ధ్యాస ఉండదు. అంటే జనాభా లెక్కలలో మాత్రమే వాడు హిందువు. వీడి వల్ల సమాజానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ.
2. హిందూ వ్యతిరేక హిందువు : హిందువు పేరు పెట్టుకుని హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడు. హిందూ ధర్మంలో తప్పితే ఇంక ఎక్కడా వాడికి ఏ రకమైన వైపరీత్యాలు కనబడవు.
ఉదా :కమ్యూనిష్టులు ,హుజనవాదులు
వీళ్ల వల్ల సమాజానికి జరిగేది సంపూర్ణ నష్టమే తప్ప ఇంకోటి లేదు.
3. ధార్మిక హిందువు: వీడు ప్రతీరోజ పూజలు, కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు, సహస్ర లింగార్చనలు, అప్పుడప్పుడు లక్ష పత్రి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేయడం, ప్రతి రోజూ లేకపోతే కనీసం వారంలో ఒక్కసారి గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకోవడం, పండగ రోజు అభ్యంగన స్నానం చేయడం లాంటివి చేస్తాడు.
కాని తన కుటుంబం తప్ప మిగిలిన హిందూ సమాజం ఎలా ఉంది అన్న విషయం వీడికి అక్కరలేదు. తన కడుపు చల్లగా ఉంటే చాలు అనే ధోరణిలో ఉంటాడు. ఇలా చేయాలి అని కూడా ప్రక్కవాడికి చెప్పడు. కానీ వీడు కూడా అవసరమే. వీడి వలననే సమాజం నిలబడుతుంది.
4. సామాజిక హిందువు: హిందూ సమాజ రక్షణ కోసం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు. పూజలు పునస్కారాలకన్నా జాతిని జాగృతం చేయడం, జాతిని ఐక్యతగా ఉంచడం చాలా అవసరం అన్న ఆలోచనలో ఉంటాడు.
హిందువుల రక్షణ నా తక్షణ కర్తవ్యం అన్నట్టుగ వీడి నిత్య జీవితం ఉంటుంది. దానికోసం ఎన్ని కష్ట నష్టాలైనా భరిస్తాడు.
సమాజంలో అతి తక్కువ ఉన్నది వీరే.వీరి సంఖ్య పెరగాలి. వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరి సంఖ్య దేశం మొత్తంలో 3% కన్నా తక్కువ ఉంటేనే దేశంలో పరిస్ధితులలో మార్పు స్పష్టంగా కనబడుతోంది.
సామాజిక మాధ్యమాలలోగాని, చర్చలలోగాని, సినీ పరిశ్రమలో గాని వీరి గళం ఇప్పుడిప్పుడే వినపడుతోంది.
వీరి సంఖ్య ఇంకా బాగా పెరిగితే పూర్వ వైభవ స్ధితి రావడం ఎంతో దూరంలో లేదు. నీవు చేయవలసిన పని ప్రశ్నించడం ధర్మం కోసం దేశం కోసం పౌరుడిగా?

– బింగుమళ్ల సుధాకర్

LEAVE A RESPONSE