Suryaa.co.in

Andhra Pradesh

నన్ను సిఐడి వారు బట్టలు విప్పి విపరీతంగా కొట్టారు

-ఈ విషయం జడ్జ్ గారికి చెబితే నీ రెండేళ్ల కొడుకుని కూడా చంపేస్తాం
-కోర్టులో జడ్జి ముందు కన్నీటి పర్యంతమైన బొబ్బురి వెంగల్ రావు

నెల రోజుల క్రితం వెంకటేష్ అనే వ్యక్తి మేము కొట్టాం అని జడ్జి గారికి చెప్తే రెండు బెయిల్ రాలేదు నువ్వు కూడా కొట్టావ్ అని చెప్తే నీకు బెయిల్ రాడు. కొట్టలేదు అని చెప్తేనే నీకు బెయిల్ వస్తుంది. ఉదయం నాతో ఒక కాగితం మీద సంతకం చేయించుకున్నారు. అందులో ఏ విషయం వాస్తవం కాదు. నేను సంతకం పెట్టను అంటే పెట్టే వరకు కొట్టారు. నువ్వు సంతకం పెట్టకపోతే నిన్ను రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేశాం. రేపటి వరకు మాకు టైం ఉంటుంది. నిన్ను మళ్ళీ కొడతాం.

ఎంపీ రఘురామ రాజును కొడితేనే దిక్కు లేదు.నిన్ను కొడితే కోర్టులు ఏం చేస్తాయి. నువ్వు కనుక జడ్జి గారి దగ్గర నిన్ను కొట్టిన విషయం చెబితే, మళ్ళీ నువ్వు బయటకి వచ్చాక నిన్ను చంపేసిన కూడా కోర్టులు ఏమి చేయలేవు. నువ్వు మేము చెప్పినట్లు వింటేనే నువ్వు బతుకుతావు.. లేదంటే నువ్వు నీ కుటుంబం కూడా మిగలదు అని, నన్ను బెదిరించి నా సంతకాలు పెట్టించుకున్నారు. నేను ఏం రాశారో చదువుకుని సంతకం పెడతాను ఆన్న కూడా వినలేదు. మేము కొట్టాము అని కనుక చెబితే నీ కుటుంబాన్ని ఎలా కేసుల్లో ఇరికించాలో మాకు తెలుసు.

ఎలా కొట్టారు అని జడ్జ్ ప్రశ్నించగా
రెండు చేతులు పైకి కట్టేసి చేతి మధ్యలో కర్ర పెట్టీ , అరి కాళ్ళ మీద కొట్టారు.తరువాత బల్ల మీద పడుకోబెట్టి నా నడుము పై కూర్చుని కాళ్ళు పైకి ఎత్తి కొట్టారు. ఒక కర్ర తీసుకుని నా వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి నన్ను భయపెట్టారు . కొట్టిన తరువాత నువ్వు మేము కొట్టాం అని చెప్పినా ఎవరూ నమ్మరు. నీకు ఒంటి మీద గాయాలు లేవు. అలా కొట్టడమే మా టాలెంట్.

నాకు భార్య రెండేళ్ల కుమారుడు 60 ఏళ్ల పై బడిని తల్లిదండ్రులు ఉన్నారు. నన్ను చంపేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది. నువ్వు ఇంకోసారి వీడియో మాట్లాడితే చంపేస్తాం. నువ్వు చేయాలి అనుకుంటే వైసీపీ కి అనుకూలం గా వీడియోలు చేయి. లేదంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాం.

LEAVE A RESPONSE