-దళితులలో సమర్ధులు మేధావులు లేరనా జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశం
-కలెక్టర్ ని జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు నిలబెట్టి అవమాన పరిచారు
-టిడిపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి
లోకేష్ బాబు తన పాదయాత్రలో దళితుల సమస్యల గురించి మాట్లాడుతూ పెద్ద పొడిచింది లేదు, పీకింది లేదు అని జగన్మోహన్ రెడ్డి ని ఉద్దేశించి మాట్లాడితే.. సాక్షి మీడియాలో దాన్ని వక్రీకరించి ప్రచారం చేశారు. ఎంత వక్రీకరించి ప్రచారం చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దళితులకు ఉన్న పథకాలను రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్న విషయం ప్రజలందరికీ తెలుసు.
గతంలో శాసనసభలో అంబేద్కర్ గారి 125 వ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి ప్రచారం చేశారు. దళితులు ఎవరైనా పేద కుటుంబంలో పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు నాయుడు మాట్లాడితే.. ఆ మాటలను కూడా వక్రీకరించారు. ఇటువంటి తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారనెందుకు ఇలాంటి నిదర్శనాలు కోకొల్లలు. మొన్న అసెంబ్లీలో నాపై దాడి జరిగితే వైసిపి నాయకులు తాము స్పీకర్ పై దాడి చేసినట్లు వక్రీకరించి మాట్లాడారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు.
దళితులకు అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమే. ప్రభుత్వ సలహాదారులుగా దళితులను ఎందుకు పెట్టలేదని కొందరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించగా.. సలహాదారులుగా ఉండడానికి మేధావులు, సమర్ధులు ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అంటే దళితులలో సమర్ధులు మేధావులు లేరనా ఆయన ఉద్దేశం. మొన్న పల్నాడు జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ అయిన కలెక్టర్ ని జగన్ మోహన్ రెడ్డి తో పాటు మంత్రులు నిలబెట్టి అవమానపరిచారు.
ఇటీవల మార్కాపురం పర్యటనలో జగన్ బంధువును అడ్డుకున్నాడని జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ ను పక్కన పెట్టి జగన్ రెడ్డి చుట్టమైన మాజీ మంత్రిని పిలిచి ఆయన చేత బటన్ నొక్కించి మంత్రిని అవమానపరిచారు. దళితులను అవమాన పరుస్తున్నారనడానికి నిదర్శనాలు ఇంతకన్నా ఇంకేమి కావాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడని మాటలను వక్రీకరించి, మార్ఫింగ్ చేసి ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేవు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఇకనైనా ఈ అసత్యపు ప్రచారాలను మానుకోవాలని జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాము అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.