ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష
తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, సమీక్ష సందర్భంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీతో అందించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు.. ఆరోగ్య శ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం. ఎక్కడా కూడా బకాయిలు లేకుండా చూస్తున్నాం. ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగింది. రోగులకు మరిన్ని వైద్య సేవలను ఇప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 104 కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్ సర్వీసులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ కింద అందుతున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో బుక్‌లెట్స్ కూడా ఇస్తున్నామన్నారు. ఆసుపత్రుల వివరాలు, అందుతున్న సర్వీసుల వివరాలు కూడా ఇందులో ఉంచుతున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్రలు, సేవారత్న, ఉన్నత ఆరోగ్య సేవా అవార్డులు అందించనున్నట్టు తెలిపారు.
ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సలు..
– మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల సంఖ్య 1059 కాగా.. జనవరి 2020లో 2059కి పెంచుతూ వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు వేయి రూపాయల ఖర్చుకు పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.
– జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం. ఈ సందర్భంగా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్లను చేర్చారు.
– నవంబర్ 2020లో 2436 పెంపు. బోన్ మ్యారోతోపాటు 235 ప్రొసీజర్ల చేరిక.
– మే-జూన్ 2021లో 2446కు ఆరోగ్యశ్రీ చికిత్సల పెంపు. 10 కోవిడ్ ప్రొసీజర్ల చేరిక.
– 2022లో 3255కు పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే…
వైద్య ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకు వచ్చాం.భారీ సంఖ్యలో మునుపెన్నడూలేని విధంగా సుమారు 46వేల పోస్టులను భర్తీచేశాం.ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన సేవలు అందాలన్నదే లక్ష్యం.. ఆరోగ్యవంతమైన సమాజంతో మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి వాటిని భర్తీచేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించాం..
సౌకర్యాలు, వసతులు, సరిపడా సిబ్బందిని ప్రభుత్వం నుంచి ఇవ్వగలిగాం..ఇక అంకిత భావంతో పనిచేసి, ప్రత్యేక శ్రద్ధతో ఈ వ్యవస్థలను మెరుగ్గా పనిచేయించడంపై దృష్టిపెట్టాలి..ఎక్కడా కూడా అలసత్వానికి, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు ఉండాలి.
వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును తప్పనిసరి చేయాలి. అక్టోబరు 21 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌పై ట్రయల్ రన్ ప్రారంభించామన్న అధికారులు.ప్రతి పీహె చ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారన్న అధికారులు. మొత్తంగా ప్రతి పీహెచ్‌సీలో 14 మంది సిబ్బంది ఉంటారని తెలిపిన అధికారులు.ప్రత్యేక యాప్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలువుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తున్నామన్న అధికారులు.
67 రకాల మందులుతో విలేజ్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
14 రకాల ర్యాపిడ్ కిట్లను కూడా విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉంచామన్న అధికారులు.
ఇప్పటికే డాక్టర్లకు 2248 సెల్‌ఫోన్లు, ట్యాబులు పంపిణీచేశామన్న అధికారులు.
మందులు సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
దీంట్లో భాగంగా ఇప్పుడున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్లను భవిష్యత్తులో కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
విలేజ్ క్లినిక్స్‌లో ఎక్కడ మందులు అయిపోతున్నా సమీపంలో ఉన్న పీహెచ్‌సీ నుంచి వీటిని సరఫరా చేసే ఏర్పాటు చేస్తామన్న అధికారులు.
మందుల పంపిణీ, నిల్వ, కొరత తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆన్లైన్ పద్ధతుల్లో పర్యవేక్షణ చేస్తామన్న అధికారులు.
మండలాల ప్రాతిపదికన ప్రతి విభాగంపైన పర్యవేక్షణ అధికారులు ఉండేలా తగిన ఆలోచనలు చేయాలన్న సీఎం.
ఎంఈవో, ఎమ్మార్వో, ఎండీవో తరహాలో ప్రతి ప్రభుత్వ విభాగంలో పనిచేసే వారిపై పర్యవేక్షణకు ఒక మండలస్థాయి వ్యవస్థ ఉండేలా తగిన ప్రణాళిక రూపొందించాలన్న సీఎం.
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై కూడా మండలస్థాయిలో పర్యవేక్షణకు ఒక ఆలోచన చేయాలన్న సీఎం.
దీనిపై సరైన కసరత్తు చేసిన ప్రతిపాదనలు తనకు అందించాలన్న సీఎం.
ఎయిర్ పొల్యూషన్, పారిశుద్ధ్యం, తాగునీరు, స్కూళ్లు, అంగన్‌వాడీలలో టాయిలెట్ల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం.
క్రమం తప్పకుండా ఈ నివేదికలు తెప్పించుకుని, గుర్తించిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.
రక్తహీనత కేసులను జీరోకి తీసుకు రావాలన్న సీఎం.
ఇన్ని వ్యవస్థలను మనం తీసుకు వస్తున్నందున ఆరోగ్య రంగంలో సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్న సీఎం.
స్త్రీ శిశు సంక్షేమ శాఖతో కలిసి పనిచేయాలన్న సీఎం.
ప్రసవం సమయంలో హై రిస్క్ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు.
వీరిని ముందుస్తుగానే ఆస్పత్రికి తరలించి వారికి వైద్యంపై దృష్టిపెడతామన్న అధికారులు.
సంపూర్ణ పోషణ ద్వారా వీరికి ఆహారం సక్రమంగా అందుతుందా? లేదా? అన్నదానిపై కూడా నిరంతర పర్యవేక్షణ చేయాలన్న సీఎం.
ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్ హిస్టరీని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలన్న సీఎం.
దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్ రోగులకు సరైన వైద్య సేవలు అందించగలుగుతారన్న సీఎం.
గ్రామానికి సంబంధించిన మొత్తం హెల్త్ రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలన్న సీఎం
నిరంతరం ఈ రికార్డులను అప్డేడ్ చేసుకుంటూ క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకునేలా ఉండాలన్న సీఎం.
వీటిని చూసి ఫ్యామిలీ డాక్టర్ తగిన రీతిలో సేవలు అందించగలరన్న సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఏపీ వైద్యవిధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ డీజీ(డ్రగ్స్) రవిశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.