Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి గులకరాయి డ్రామాలో పోలీసులు అభాసుపాలు

– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్ రెడ్డి గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సహకరించి ఆభాసు పాలయ్యారని పట్టాభి అన్నారు. ఫేక్ సర్టిఫికేట్లు, తప్పుడు రిపోర్ట్ లతో అడ్డంగా దొరికిపోయారన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాయం నుండి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

గులకరాయి పోలీసుల సారథ్యం… ఫేక్ సర్టిఫికేట్ లు సృష్టించి అభాసు పాలు
జగన్ కోసం గులకరాయి డ్రామాకు విజయవాడ పోలీసులు సారథ్యం వహించి అభాసు పాలైయ్యారని పట్టాభి అన్నారు. జగన్ ఆడిన డ్రామాను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. నేడు ప్రధాన నిందితుడిగా చూపబడుతున్న వేముల సతీష్ మైనర్ అని తెలిసే, మైనర్ ను మేజర్ అని చూపేందుకు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ సైతం సృష్టించి పోలీసులు అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆధార్ కార్డు నెంబర్: 6952 7160 4282 ప్రకారం, వేముల సతీష్ మైనర్ అని స్పష్టం తెలుస్తొందన్నారు.

నేడు ప్రధాన సాక్షిగా తెరమీదకు తీసుకు వచ్చిన వేముల దుర్గారావు ఇచ్చిన సాక్షి స్టేట్ మెంట్ ఏదైతే పోలీసు వారు కోర్టుకు సమర్పించారో, దానిలో స్పష్టంగా ఏప్రిల్ 14 ఉదయం సతీష్ తన పుట్టిన రోజు సందర్భంగా… కేక్ కటింగ్ జరిగిందని వచ్చి కేక్ తిని వెళ్లాల్సిందిగా కోరగా.. తాను సతీష్ ఇంటికి ఏప్రిల్ 14 ఉదయం దుర్గారావు వెళ్లాడని స్పష్టంగా పేర్కొనబడింది. కానీ విజయవాడ పోలీసు వారు మైనరైన సతీష్ ను మేజర్ గా మార్చేందుకు నిసిగ్గుగా.. ఏప్రిల్ 16న ఫేక్ బర్త్ సర్టిఫికేట్ సృస్టించి దానిలో అక్టోబర్ 14 – 2025 తేదిని సతీష్ పుట్టిన రోజుగా మార్చి చూపారు.

మరి పోలీసు చెబుతున్న ప్రకారం అక్టోబర్ 14 సతీష్ పుట్టిన రోజు అయితే , మరి వారు కోర్టు కు సమర్పించిన దుర్గారావు సాక్షి స్టేట్ మెంట్ లో ఏప్రిల్ 14న తాము పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నామని ఉన్న మాట గమనించలేదా ? దీని ద్వారా పోలీసు తాము చేసిన తప్పును బయటపెట్టుకున్నట్లు అయ్యింది. వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేస్తూ.. తప్పుడు సర్టిఫికెట్ లతో గులక రాయి డ్రామాకు సహకరిస్తూ.. అమాయకులైన వడ్డెర బిడ్డలను, మైనర్ లను బలిచేసేందుకు పనిచేస్తున్న విజయవాడ సీపీ కాంతి రాణా, ఇతర అధికారులపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

రిమాండ్ రిపోర్టులో డొల్లతనం
వడ్డెర సమాజిక వర్గానికి చెందిన మైనర్ బాలుడు వేముల సతీష్ అరెస్ట్ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టు మొదటి పేజీ మూడోవ పేరాలో.. ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై గులకరాయి దాడి జరిగినట్లు పేర్కొన్న విజయవాడ పోలీసులు, తరువాత పేజీ నెంబర్ 2 పేరా నెంబర్ 9 లో ముఖ్యమంత్రి పై దాడి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల 4 నిమిషాలకు జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా రిమాండ్ రిపోర్టులో పేజీకి ఒక రకంగా దాడి జరిగిన సమయాన్ని పేర్కొని, విజయవాడ పోలీసులు నవ్వుల పాలయ్యారన్నారు.

మేము చెబుతున్న విధంగా గులకరాయి దాడి ఘటన మొత్తం ఒక పెద్ద నాటకమని ఈ రిమాండ్ రిపోర్టు చదివితే స్పష్టంగా అర్థం అవుతుంది. కరెక్ట్ గా ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల 04 నిమిషాలకు దాడి జరిగిందని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు, అధి వారికి ఎలా సాధ్యం అయ్యిందో ప్రపంచానికి తెలియజేయాలి. వేముల సతీష్ పక్కన ఆ సమయంలో ఎవరైనా పోలీసు అధికారి వాచి పట్టుకుని నించుకుని మరి అంత కరెక్ట్ గా నిమిషాలతో సహా.. సమయాన్ని నోట్ చేశారని అనుకోవాలా ? ఇప్పటికైనా ఈ తప్పుడు రాతలు మానుకోండి. కాంతి రాణా లాంటి అధికారులు నేడు చేస్తున్న తప్పులకు, భవిష్యత్ లో శిక్ష అనుభవించి తీరాల్సిందే.

సాక్ష్యం చెప్పని స్థానికులు… సాక్షిగా పులివెందుల వ్యక్తి ప్రత్యక్షం
జగన్ రెడ్డిపై గులకరాయి దాడి పూర్తిగా డ్రామా అని అర్థం చేసుకున్న స్థానికులు ఎవరూ కూడా పోలీసులకు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదని పట్టాభి అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నందినేని మనోహర్ నాయుడు అనే పులివెందుల వాసిని నేడు పోలీసులు సాక్షిగా హాజరు పరిచారు. ఇంత కంటే సిగ్గుమాలిన పని వేరే ఏమైనా ఉంటుందా… దీనిని బట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ పౌరుడు కూడా, ఈ గులకరాయి డ్రామాను నమ్మడం లేదని పోలీసు వారి కుట్రను బలపరిచే విధంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించారన్న విషయం అర్థం అవుతోంది.

అందుచేతనే పులివెందుల సాక్షిని ప్రవేశ పెట్టారా సీపీ గారు? పోలీసులు ప్రవేశ పెట్టి మిగతా సాక్షుల వివరాలు గమనిస్తే…. మనకు అందరూ వైసీపీ నాయకులు పోలీసులే కనబడతారు. పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్షుల పేర్లు
‘’ ‘సాక్షుల పేర్లు: 1.వెల్లంపల్లి శ్రీనివాస్, 2.దేవినేని అవినాష్, 3. మమ్మద్ రుహుల్లా( వైసీపీ ఎమ్మెల్సీ) 4.అవుతు శైలజా రెడ్డి( వైసీపీ కార్పొరేటర్) 5.పోతిన మహేష్( వైసీపీ నేత) 6.నందినేని మనోహర్ నాయుడు (పులివెందుల) 7.రవికిరణ్ (ఏసీపీ), 8.హనీస్ బాబు (సీఐ).

చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు ?
బలహీన వర్గానికి చెందిన మైనర్ బాలుర జీవితాలతో ఏపీ పోలీసుల, వైసీపీ నాయకులు ఆటలాడుతుంటే ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ అప్పారావుగారు ఏం చేస్తున్నారు? ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి మరి ఒక మైనర్ బాలుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంటే.. రాష్ట్ర చైల్డ్ రైడ్స్ కమిషన్ నిద్ర పోతుందా.? రాష్ట్రంలోని బాలుర హక్కులను కాపాడాల్సిన బాధ్యత చైల్డ్ రైడ్స్ కమిషన్ చైర్మన్ కు లేదా అని నిలదీశారు. ఈ సంఘటనపై తక్షణమే అప్పారావు స్పందించాలని పట్టాభి డిమాండ్ చేశారు.

వెల్లంపల్లికి ఒటమి భయం… బొండా ఉమాను ఇరికించేందుకు కుట్ర
అవినీతి వెల్లంపల్లికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే ప్రజల పక్షాన పోరాడే బొండా ఉమాను ఇరికించేందుకు పోలీసులతో జగన్, వెల్లంపల్లి కుట్ర చేశారన్నారు. బొండాను ఎదుర్కొనే దమ్ములేక.. వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న ఉమాపై ఈవిధంగా పోలీసులు దాడి చేయడాన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా పరిగణించాలన్నారు.

పోలీసుల స్క్రిప్ట్ ప్రకారం గులకరాయి దాడి జరిగిన తరువాత నిందితుడు సతీష్, తన స్నేహితుడైన వేముల దుర్గారావుతో తాను చేసిన దాడి గురించి చెప్పాడట… ఆవిషయాన్ని తన తండ్రి ఎలయ్యకు చెబితే , ఎల్లయ్య తన కుమారుడిని స్థానిక వీఆర్వో వద్దకు తీసుకు వెళ్లి జరిగిన సంఘటనపై స్టేట్ మెంట్ ఇప్పించాడట.? ఈ పోలీసు స్క్రిప్ట్ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే.. సాధారణంగా ఏ పౌరుడైనా ఒక నేరం గురించి సమాచారం ఇవ్వాలంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళతారా? లేక వీఆర్వో కార్యాలయానికి వెళతారా ? వీఆర్వోలకు నేర పరిశోధనతో ఎక్కడైనా సంబంధం ఉంటుందా ? ఈ రకంగా ప్రజలను గొర్రలకంటే హీనంగా లెక్కగట్టి ఇటుటవంటి కథలు అల్లడానికి పోలీసులు ఇంతగా దిగజారాలా?

ఎలక్షన్ కమిషన్ కు విజ్ఞప్తి
రేపు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొండా ఉమాగారిని తప్పుడు కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ సీపీ కాంతి రాణాని తక్షణమే విజయవాడ సీపీ పదవి నుండి తొలగించాలి..

LEAVE A RESPONSE