– తన భార్య కూతుర్ని సురక్షితమైన ప్రదేశానికి పంపిస్తూ ఆవేదన చెందుతున్న తండ్రి
రష్యా తన యుద్ధ విమానాలతో ఉక్రెయిన్లో బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొంతమంది తమ భార్యాపిల్లలైనా ప్రాణాలతో బయటపడాలని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలా పంపిస్తూ ఓ తండ్రి తన కూతురిని హత్తుకుని ముద్దులు పెడుతూ ఏడుస్తున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది ఆ పాప కూడా తండ్రిని పట్టుకుని బిగ్గరగా ఏడ్వడం గుండెల్ని పిండేస్తోంది.గుండెను పిండేసే ఈ వీడియో గత రెండురోజులుగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.