Suryaa.co.in

Andhra Pradesh

డ్రామాలను మేం ఖండించలేం

– ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతోనే గులకరాయి డ్రామా
– మంత్రులకు చేతనైతే దాడి చేసిన వాడిని పట్టుకోకుండా చంద్రబాబు నాయుడిపై ఏడుపెందుకో?
– సీఎం కే రక్షణ కల్పించలేని సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఈసీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి
– నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం..కానీ డ్రామాలను మేం ఖండించలేం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతిక్షణం మంత్రులు, వైసీపీ నేతలు ఇది చంద్రబాబు నాయుడు కుట్ర, ప్రతిపక్షాల కుట్ర అనడం విడ్డూరంగా ఉంది. చేతనైతే దాడి చేసిన వాడిని పట్టుకుని చర్యలు తీసుకోండి.

సీఎంపై దాడి జరుగుతుంటే మీ డీజీపీ ఏం చేస్తున్నారు. మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండి. మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఆ అధికారులు చేతకానివాళ్లని, మీ కాళ్ల కింద నలిగిపోతున్నారని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం.

ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రిని కాపాడలేని అధికారులు రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతారు? చంద్రబాబు నాయుడు కుట్ర అని హోంమంత్రి కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. హోమంత్రి ఏం చేస్తున్నట్లో. ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్నారా?

విశాఖలో పిన్నీసు గుచ్చుకున్నంత గాయం తగిలి ఒక్క బొట్టు రక్తం కారితే ఏపీలో ట్రీట్మెంట్ చేసే వైద్యులు లేరని హైదరాబాద్ వెళ్లారు. ఏపీ పోలీసులను చేతకానివాళ్లుగా చూపి, ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. విచారణ జరిపిన ఎన్ఐఏ కుట్రలు లేవు, కుతంత్రాలు లేవని తేల్చిపడేసింది, కానీ ఐదేళ్లు ఆ శ్రీనును జైల్లో అన్యాయంగా ఉంచారు.

చిన్నాయన వివేకానందరెడ్డి చనిపోతే మొదట గుండెపోటు అని మీరే చెప్పారు. మీ ఏ2 కూడా అదే సెలవిచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు చంద్రబాబు అంటూ పాటెత్తుకున్నారు. ఈ రోజు జైలులో ఎవరున్నారు. సీబీఐ విచారణలో ముద్దాయిలు ఎవరని తేలింది. సాక్షాత్తు మీ చెల్లెళ్లు ఏమి చెబుతున్నారు?

2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, మా చిన్నాయన్ని చంపేశారు, ఒక్క ఛాన్స్ అంటూ డ్రామాలేశారు.ఇప్పుడు మళ్లీ టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తోందని తెలుసుకుని గులకరాయి డ్రామాకు తెరలేపారు. ప్రతి దానికి చంద్రబాబు చంద్రబాబు అని పాట పాడటం దుర్మార్గం.

పులివెందుల పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒక్క దెబ్బకే అంత వంగిపోయాడే. మొన్న బిరదవోలు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కాల్చిన బాణసంచా నా తలపై పడి గాయమైంది. నేను జగన్మోహన్ రెడ్డి లాగా ఏడుపు ముఖం పెట్టలేదే.

జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లి ఈ ఐదేళ్లు ఏం చేశారు. రాష్ట్రాన్ని ఎన్ని అప్పులతో ముంచారు. ఎన్ని పరిశ్రమలు తరిమేశారో. ఎన్ని అక్రమ కేసులు బనాయించారు. ఎంత వృద్ధి రేటు సాధించారో చెప్పకుండా ఈ డ్రామాలెందుకు

LEAVE A RESPONSE