– బెంజ్ మంత్రి వాల్మీకిలకు చేసింది ఏంటి?
– ఇక్కడ ఉన్న వాల్మీకిలు ఒక్క ఎకరం కొనే పరిస్థితి ఉందా?
– టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం
– పదో తరగతి ఫెయిల్ అయిన జగన్ కి క్రీడల విలువ ఏం తెలుస్తుంది?
– బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం
– యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది వైసీపీ.
– కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కారుమంచి లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో భేటీ అయిన నారా లోకేష్
కల్లుగీత కార్మికులను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. భీమా కూడా లేదు, చెట్ల పెంపకానికి బీడు భూములు ఇవ్వాలి. వడ్డెర కులస్తులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. మాకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు పడటం లేదు. కాలేజీ వాళ్ళు డబ్బులు కట్టాలి అని వేధిస్తున్నారు అంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువకుడు. బీసీ క్రీడాకారులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన క్రీడాకారుడు. బిసి సర్టిఫికేట్లు తీసుకోవడం లో అనేక ఇబ్బందులు పడుతున్నాం. యాదవ సామాజిక వర్గానికి వైసిపి హయాంలో తీవ్ర అన్యాయం జరిగింది. – ఆలూరు నియోజకవర్గం బీసీ ప్రతినిధులు
లోకేష్ మాట్లాడుతూ…
బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే. బీసీలకు పెద్ద పీట వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు . స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం. టిడిపి హయాంలో ఆర్ధిక శాఖ, టిటిడి, తుడా ఛైర్మెన్ లాంటి కీలక పదవులు బిసిలకు ఇచ్చాం. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతు ని తెచ్చుకున్నారు. జగన్ పాలనలో నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బిసిలకు పదవులు దక్కకుండా చేశారు జగన్ రెడ్డి.
బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారు.ప్రజా సమస్యలు పరిష్కారం చెయ్యమని అడిగితే బెంజ్ మంత్రి బిసిల పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
బెంజ్ మంత్రి వాల్మీకిలకు చేసింది ఏంటి? ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలకు చిన్న కారు కొనుక్కునే స్థితిలో అయినా ఉన్నారా? బెంజ్ మంత్రి గారు వందల ఎకరాలు అధిపతి అయ్యారు. ఇక్కడ ఉన్న వాల్మీకిలు ఒక్క ఎకరం కొనే పరిస్థితి ఉందా? ఇటినా భూములు పై ఛాలెంజ్ చేసా. ప్రభుత్వ ధర చెల్లిస్తే భూములు రైతులకు రాసిస్తా అని బెంజ్ మంత్రి అన్నారు. ఆ డబ్బులు మేము చెల్లిస్తాం అని చెప్పా. ఆ భూములు రైతుల పేరిట రాయడానికి బెంజ్ మంత్రి సిద్దమా?
వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేందుకు టీడిపి సత్యపాల్ కమిటీ వేసాం, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.నాలుగేళ్లు డ్రామా చేసిన జగన్ ఇప్పుడు బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని కొత్త తీర్మానం అంటున్నాడు.
వాల్మీకిలకి టిడిపి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రం తో పోరాడతాం. బిసిలను జగన్ ప్రభుత్వం వేధిస్తుంది. సుమారుగా బిసిల పై 26 వేల కేసులు పెట్టారు.అందుకే ప్రత్యేక బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేస్తాం.బిసిలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్ల లో బిసిలకు రిజర్వేషన్ కల్పిస్తాం. సొంత మద్యం వ్యాపారం కోసం జగన్ కల్లు గీత కార్మికులను వేధిస్తున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం.మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పనిముట్లు అందిస్తాం, చెట్ల పెంపకం కోసం సహాయం, భీమా కల్పిస్తాం. వడెర్ల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ. వడెర్ల కోసం మైన్లు కేటాయించింది టిడిపి. ఆ మైన్ల ను వైసిపి నాయకులు లాక్కున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మైన్లు మీకు తిరిగి కేటాయిస్తాం.బడుగు, బలహీన వర్గాలను విద్య కి దూరం చేస్తుంది జగన్ ప్రభుత్వం.ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారు జగన్.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఒత్తిడి లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తాం. పదో తరగతి ఫెయిల్ అయిన జగన్ కి క్రీడల విలువ ఏం తెలుస్తుంది. రాయలసీమకు స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.బీరప్ప దేవాలయాలు నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తాం. అలాగే పూజారులను గౌరవ వేతనం ఇచ్చి ఆదుకుంటాం.కురబ సామాజిక వర్గం వారి కోసం టిడిపి హయాంలో గొర్రెలు కొనడానికి రుణాలు అందించాం. మందులు, మేత, దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ లో మందులు, మేత, దాణా అందజేస్తాం. ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తాం.డప్పు కళాకారులని ఆదుకుంటాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం.యాదవ సామాజిక వర్గాన్ని ఆదుకుంది టిడిపి. యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసింది వైసీపీ.