Suryaa.co.in

Features International

ఏం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ మధ్య?

నిజానికి రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయట్లేదు. ఉక్రెయిన్ రెబల్ (ఇక్కడ స్ధానికంగా రష్యన్ ప్రభావం ఎక్కువ) ఉన్న రెండు ప్రాంతాలను రష్యన్ ప్రజలు ఉన్నారనే కారణంతో స్వాధీనం చేసుకుంటుంది. ఉక్రెయిన్ ఒకపుడు రష్యాలో బాగమే, అందుకని రష్యా ఎపుడూ కూడా ఉక్రైయిన్ ని ఒక దేశంగా చూడదు. నాటో కూటమిలో ఉక్రైయిన్ చేరిక అంశం రష్యాకు నచ్చలేదు. అమెరికాతో సహ ఉన్న 30 దేశాల నాటో కూటమిని ఖాతరు చేయకుండా ముందుకు వెళుతుంది రష్యా.

రష్యా ఎందుకు చేస్తుంది..?
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అగ్రరాజ్యాల హోదాలో అమెరికా రష్యా ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగింది. సోవియట్ యూనియన్ 1991లో విడిపోయింది. రష్యా యూరప్ లో భాగం అయినా ఒంటరి అయింది. చాలా భూమిని వనరలను కోల్పోయింది. పైగా తన నుండి విడిపోయిన కొన్ని దేశాలు తనకే వ్యతిరేక గళం విప్పడం శక్తివంతమైన రష్యా అసలు సహించదు. సమయం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తుంది. పుతిన్ పాలనలో సైనికంగానే కాక ఆర్ధికంగా, వ్యాపార పరంగా గతంలో కంటే శక్తివంతంగా తయారైంది రష్యా.

ఉక్రెయిన్ ఉనికిని ప్రభుత్వాన్ని తాము గుర్తించము అని బహిరంగంగానే మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ దేశాన్ని నాటో గుర్తించి తమలో కలుపుకోవడం రష్యాకు ప్రమాదం. నాటో ఒప్పందంలో భాగంగా అమేరికా రష్యా సరిహద్దు దేశాల్లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసే అవకాశం నాటో కూటమి ఇస్తున్నట్టే.. ఇదే ఈ యుధ్ధానికి అసలు కారణం.

ఈ విషయం పుతిన్ ప్రశ్నించాడు కూడా.. కెనడాలో రష్యా స్థావరం ఏర్పాటు చేసుకుని వైట్ హౌస్ వైపు క్షిపణులు మోహరించడానికి అమెరికా ఒప్పుకుంటుందా..? అని ఘాటుగా స్పందించాడు అధ్యక్షుడు పుతిన్. కరోనా తరువాత పరిస్ధితులు మారాయి. రష్యాకు సమీపంలో ఉన్న కొన్ని నాటో దేశాలు సైలెంట్ గా ఉండటం పరోక్షంగా రష్యాకు కలిసివచ్చింది. ఇదే మంచి తరుణం అని ఎవ్వరినీ లెక్క చేయకుండా ముందుకు వెలుతుంది పుతిన్ సైన్యం. నాటో కూటమిలో రష్యా సరిహద్దు దేశాలకు పరొక్ష హెచ్చరిక అని భావించవచ్చు..

నాటో వెర్షన్ ఏంటి..?
నార్త్ అట్లాంటిక్ దేశాలు పరస్పరం రక్షణ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్న 30 దేశాల కూటమే “నాటో “.. ఒక దేశానికి సైనిక అవసరం వచ్చినప్పుడు కూటమిలో ఇతర సభ్య దేశాలు సైనిక ఆయుధ సహకారాలు అందించుకోవాలి. ఇకపోతే ఇదే కూటమిలో రష్యా కూడా చేరవచ్చు కాని చేరదు..! ఎందుకంటే “నాటో “స్వయంగా పిలిస్తేనే చేరుతుంది. కాని తనకు తాను రిక్వెస్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ ఉన్నది రష్యా.. మేము ప్రత్యేకం మేము ఎందుకు అడగాలి మీరే మాకు ఆహ్వానం పంపండి అనే స్వభావం రష్యాది.. నాటోకు ప్రత్యేక ఆహ్వానాలు పంపే అలవాటు లేదు.. ఉక్రెయిన్ కి సహకారంగా నాటో దళం కొంత మేరకు దింపే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది..

భారత్ మరియు ప్రపంచంపై ప్రభావం ఏమిటి..?
సింపుల్… మొన్నటిదాకా రష్యా “బెస్ట్ ఫ్రెండ్”. అమెరికా మన అవసరాలకు పుట్టిన శ్రేయోభిలాషి. రష్యా అమెరికా రెండు దేశాలతో భారీ వాణిజ్యం మరియు సైనిక ఒప్పందాలు ఉన్నాయి. భారత్ ఇరు దేశాలలో ఏ ఒక్క దేశాన్ని దూరం చేసుకునే సాహసం చేయదు. సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణంలో రష్యా మౌనం వహిస్తే అమెరికా సహకారం అనివార్యమని భారతదేశానికి తెలుసు. అందుకే అమెరికా తో భారీ స్ధాయిలో వాణిజ్యం, టెక్నాలజీ,రక్షణ విభాగాల్లో బలమైన ఒప్పందాలు భారత్ చేసుకుంది. అంతర్జాతీయ వేదికల మీద భారత్ ఇమేజ్ పెరగాలన్నా అమెరికా అవసరం మనకు ఉంది.

రష్యాతో వాణిజ్యం , క్రూడ్ ఆయిల్, రక్షణ , ఆయుధ తయారీ , దిగుమతులు, ఇలా పలు అంశాలలో కీలక ఒప్పందాలు చేసుకుంది భారత్. అంతేకాకుండా దీర్ఘకాలిక భారత మిత్ర దేశాలుగా భారత్ – రష్యాలకు పేరుంది. భారత్ తన ఇంధన అవసరాలకు ONGC విదేశ్ లిమిటెడ్ రూపంలో రష్యాలో చాలా పెట్టుబడులు పెట్టింది భారత్. అందుకని ఉక్రెయిన్ విషయంలో న్యూట్రల్ పాత్ర వహించడం భారత్ కి మేలు. ఇపుడు అదే చేస్తుంది. అలాగే ఇతర నాటో కూటమి దేశాలతో కూడా ఇలాగే ఉంటుంది భారత్. పాత ఒప్పందాలను అందరూ గౌరవించాలి అని పెద్దరికం ప్రదర్శించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

త్వరలో ఆయిల్ బంగారు రేట్లు కొండక్కనున్నాయి. భారత్ తో పాటు యురోపియన్ దేశాలు రష్యానుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్,గాస్, సరఫరా భారత్ మినహ యురోపియన్ దేశాలకు నిలిపివేయవచ్చు. భారత్ తో సహ మరికొన్ని దేశాలు మల్లి ఆయుల్ ఉత్పత్తి దేశాలపైన గల్ఫ్ దేశాలపై మరింత ఆదారపడే అవకాశం ఉంది. ఒపెక్ దేశాలు ఆయిల్ రేట్లు పెంచవచ్చు. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచానికి యుద్ధం ముదిరితే మాత్రం పెద్ద సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ప్రపంచం పెద్ద సమస్యను ఎదుర్కుంటుంది. భారత్ లో పెట్టుబడుల ప్రవాహనికి కొంతకాలం బ్రేక్ పడుతుంది. స్టాక్ మార్కెట్ అనిశ్ఛితి కొనసాగడం లేదా కుప్పకూలడం జరుగుతుంది..

ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి..?
అమెరికా, రష్యా బ్రిటన్ మాట విని ఒక తింగరి ఒప్పందం 1994లో చేసుకుంది. ఈ ఒప్పంద సారాశం ఎంటంటే ప్రపంచంలో మూడో అణ్వాయుధ దేశం అయిన ఉక్రెయిన్ తన అణ్వాయుధాలు రష్యాకు సమర్పించడం. అవే ఉంటే ఉక్రెయిన్ దేశానికి ఈరోజు ఈ ధీనస్థితి వచ్చేది కాదు. ఇపుడు ఉక్రెయిన్ కు రష్యా పక్కలో బల్లెం కాదు. నెత్తిమీద రష్యా గ్రౌనేడ్ ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. నాటో కూటమి దేశాలు యురోపియన్ జపాన్ ఆస్ట్రేలియా అమెరికా పాటు ఇతర కూటమి దేశాలు రష్యా మీద ఆంక్షలు విదిస్తాయి. అయినా రష్యా తగ్గదు. ఉక్రెయిన్ భవిష్యత్తు నాటో దేశాలు సహకారం ఏ స్ధాయిలో ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పాక్షికంగా అయినా పోరాడే సత్తా ఉక్రెయిన్ కి ఉంది. కానీ రష్యాను నిలువరించడానికి సరిపోదు. నాటో దళాలు దిగితే మాత్రం వారాల తరబడి యుద్ధం జరిగే అవకాశం ఉంది. రష్యా అనుకున్నట్టు పూర్తిగా జరిగితే మాత్రం ఉక్రెయిన్ ఉనికి కూడా ఉండకపోవచ్చు…

భారత్ రష్యా సంబంధాలు గురించి..
ఏమీ కావు ,ఇంతకు ముందు ఉన్న ఒప్పందాలకు వచ్చిన సమస్య ఏమీ ఉండదు. చైనా పాక్ లు రష్యాకు దగ్గరగా జరిగినా, రష్యా విషయంలో భారత్ పొరపాటున కూడా తొందర పడదు. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ టాపిక్ వచ్చినప్పుడు భారత్ గౌర్హజరైంది. ఎందుకంటే ఉక్రెయిన్ సమస్య చాలా సున్నితమైనదిని ఎప్పటి నుంచో కామ్ గా ఉంది. కాబట్టి రష్యా భారత్ దేశాల మిత్రత్వం కొనసాగనుంది.

రష్యా ఏమంటుంది ..?
మా లక్ష్యం ఉక్రెయిన్ కాదు రెండు ప్రాంతాలు మాత్రమే..
అమెరికా నాటో సభ్యత్వం అడ్డుపెట్టుకుని మా సరిహద్దు దేశాలలో సైనిక తిష్ఠ వేస్తానంటే మేము సహించం…
మేము కెనడాలో కుర్చుని ఇదే పని చేస్తే మీరు ఊరుకుంటారా..?
మీరు ఉక్రెయిన్ లో ఎలాంటి సైనికపరంగా ఎలాంటి వేలు పెట్టనని అమెరికా ప్రకటించాలి. చట్టబద్ధం చేయాలి..
ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదు..
కాదని రష్యాకు వ్యతిరేకంగాఏ చర్య చేపట్టినా సరే … ఇప్పటి వరుకూ ప్రపంచం చూడని విపరీత పరిణామాలకు మీదే బాధ్యత అని నాటో దేశాలను హెచ్చరించింది రష్యా..

పుతిన్ ఏమన్నా తోపా..?

ఖచ్చితంగా..
రష్యా అధ్యక్షుడు అనేకంటే.., రష్యాకు సైన్యాధ్యక్షుడు అంటే కరెక్ట్ గా సరిపోయింది. ఒక ఫైటర్ ఆటిట్యూడ్ తో ఉంటాడు. మానసికంగా బలవంతుడు. తెలివైన నియంత, శ్రీమంతుడు , పుతిన్ అధ్యక్షుడు అయినా మిలట్రీ క్రమశిక్షణ కల్గిన వ్యక్తి. రాజకీయంగా, కార్పొరేట్ పరంగా, డిఫెన్స్ పరంగా పూర్తి పట్టు, అవగాహన ఉన్న వ్యక్తి. నన్ను అడిగితే ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తి ఎవరు అంటే పుతిన్ అనే చెబుతా. సిరియా లాంటి కొన్ని యుధ్ధాల్లో అమెరికా పుతిన్ ధోరణి ఫేస్ చేసింది…

మూడో ప్రపంచ యుధ్ధం వస్తుందా..?

రాకపోవచ్చు..
నాటో కూటమి -రష్యా మధ్య పూర్తిస్థాయిలో యుధ్ధంగా మారినపుడు. ఉక్రెయిన్ నాటో దళాలు సాయం అడిగినట్టు, రష్యా చైనా మరియు ఉత్తర కొరియా సాయం కోరితే మాత్రం మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. కానీ కరోనా కారణంగా 80% దేశాలు ఆర్ధికంగా దెబ్బతిని ఉన్నాయి. తేరుకోవడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు. పూర్తిస్థాయిలో యుద్ధంగా మారకపోవచ్చు. మారకూడదనే బలంగా కోరుకుందాం..

నా అభిప్రాయం..
ఇక్కడ ఎక్కువగా ప్రధాన కారణం అమెరికా కనపడుతుంది. నాటో రూపంలో రష్యా భధ్రతకు ప్రమాదం తానే కాబట్టి..!

సేకరణ
– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE