Suryaa.co.in

Andhra Pradesh

అచ్చెన్న నాయకత్వానికే మొగ్గు

– టెక్కలి లో వైకాపా నుండి‌ భారీగా చేరికలు

టెక్కలి నియోజకవర్గం టెక్కలి పట్టణం నుండి దాదాపు 12 వీధుల నుండి కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 500 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టెక్కలి పట్టణం అభివృద్ధి చెందిందంటే కేవలం‌ తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు చేసిందే తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమి లేదని వారు తెలిపారు. టెక్కలి లో మళ్లీ అచ్చెన్నాయుడునే ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గం తెదేపా నాయకులు,యువనాయకులు,తెలుగుయువత,ఐటిడిపి,తెలుగుమహిళ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE