- అమెరికా కంటే అమ్మెంత గొప్పదో ....
ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను.ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు.నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి.వృద్ధాశ్రమంలో తమ తల్లితండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు.ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు,కొందరికి పొలాలు,ఆస్తులూ ఉన్నాయి.ఎవ్వరూ చూసేవాళ్ళు లేక,పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ...
ఒక పెంకుటింటి అరుగుపై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండచుట్టి విసిరేశాడు..ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి....
ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది.
మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ.
"ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది.
ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు...
అవనిలో సగమైన మహిళా లోకానికి అన్నిట్లో సగం అవకాశాలు కల్పించాల్సిన పురుష సమాజం, పాలకవర్గం ఉద్దేశపూర్వకంగానే మహిళా సమాజాన్ని వెనక్కి నెడుతూ అణచివేస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడమే కాకుండా ఆనాటి విజయాన్ని వెలుగెత్తి చాటి చెప్పుకుంటూ నేటి మహిళ సమానత్వం గూర్చి, హక్కుల గురించి నినదించడమే...
ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది.కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై...
- ఆనందం ఎలా దొరుకుతుంది?ఎక్కడ వెతుక్కోవాలి?
నీ ఆనందాన్ని నీలో వెదుక్కుంటేనే అధికంగా, అవిరామంగా, అగణనీయంగా, అనంతంగా ఆనందాన్ని పొందుతావు.ఎందుకంటే అందరికంటే అధికంగా నిన్ను ప్రేమించేది నీవు మాత్రమే, అందరికంటే అధిక సమయం నీతో ఉండేది కూడా నీవు మాత్రమే.నీ ఇష్టాయిష్టాలు, నీ మనోభావాలు నీకు తెలిసినంతగా మరొకరికి, మరెవరికీ తెలియవు. అతి తక్కువ సమయంలో...
- ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం
- ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో
- అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు
( యండమూరి వీరేంద్రనాథ్ )
లక్షల కాపీలు అమ్ముడుపోయిని The Sky Gets Dark Slowly అన్న పుస్తకం గురించి వివరణ.
ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో...
బంధాలు...బాంధవ్యాలు..
ప్రేమాభిమానాలు కరువై
కల్మషమైన భూమిపై
నిర్మానుష్యమైన జీవితం
నేటి మనిషి గమనం....!!
మారుతున్న కాలంలో
భద్రత లేని
బ్రతుకులు ఎన్నో....!!
గత స్మృతులు గాలికి వదిలేసిన
రాగద్వేషాలలో
ఖాళీ అయిపోయిన
కల్మషం లేని
బాల్య జ్ఞాపకాలు ఎన్నో....!!
పెరుగుతున్న వ్యాపకాల్లో
వెన్నెల సాక్షిగా
ఒక్కటైన జంటలు
బండగా మారి దూరమైన
చేదు సంఘటనలు ఎన్నో...!!
ఉరుకులు పరుగుల జీవితంలో
ఆవిరైనా...
ఆస్వాదించని క్షణాలెన్నో....!!
ఏదో ఆశతో
ఇంకేదో పొందుదామనే
అర్థంలేని ఆలోచనలకు
స్వస్తి చెప్పి......
ప్రేమతో పిలిస్తూ
ఆత్మీయంగా
ఆలింగనం చేసుకునే
ముడతలు పడిన దేహాల్ని
అక్కున చేర్చుకో....!!
తరతరాల అనుబంధం
అనుభవాల శరీరం
ఆప్యాయతల సంబంధం
కుటుంబానికే వారు
మూలధనమని...
- 'ఆనందం', 'తృప్తి', 'శాంతి' మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలు
- జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?
- మన కుటుంబానికి సంతోషం పంచుతున్నామా?
- డబ్బు యావలో పడి పిల్లలకు దూరమవుతున్నాం
ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ...
ఆయనను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు...
ఒక్కసారి వెనక్కి వెళ్తే..
కాలచక్రం నన్నోసారి
గతంలోకి తీసుకుపోతే..
చేజార్చుకున్న అవకాశాలు..
మరచిపోయిన అనుభూతులు..
వెళ్లిపోయిన మనుషులు..
నిర్లక్ష్యం చేసిన సమయం..
ఒడిసిపట్టుకోలేనా..
అసాధ్యమే..
కానీ..కాస్త అనుభూతిస్తే..
ఓ వింత హాయి..
అందమైన గతం..
కొంతైనా అవగతం..!
ఒక్కసారి వెనక్కి వెళ్తే..
తీసుకున్న నిర్ణయాలు
మార్చగలమని కాదు..
తీసుకునే ముందు
ఒకటికి రెండుసార్లు
ఆలోచించవచ్చని..!
చిన్నపిల్లాడిని అయిపోతే..
మళ్లీ బుడిబుడి అడుగులు
వేయాలని కాదు..
నేను వేస్తున్నప్పుడు మురిసిపోయిన
అమ్మ మోము చూడాలని..!
బడి రోజులు తిరిగి రావాలని..
ఏదో నేర్చుకోవాలని కాదు..
బడి వదిలేసిన తర్వాత ఇప్పటివరకు కలవలేకపోయిన స్నేహితులతో...