Suryaa.co.in

Andhra Pradesh

దీన్ దయాళ్ జీ కి కోట్లమంది బిజెపి కార్యకర్తలు వారసులు

ప్రతిఒక్కరికీ సంక్షేమం అందచేయడమే మోడీ పాలనా విధానం
పేదవారికి సంక్షేమాన్ని అందిస్తూనే, దేశ ఆర్దిక శక్తిని పెంచి చూపారు
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాంలు పోయి.. స్కీం లు
దీన్ దయాళ్ జీ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దగ్గుబాటి పురంధరేశ్వరి

అమరావతి : బీజేపీకి అంత్యోదయ అనే మూల సిద్దాంతం అందించిన మహానుభావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అంత్యోదయ సిద్ధాంతం ప్రతి పాదించిన దీన్ దయాళ్ జీ కి కోట్లమంది బిజెపి కార్యకర్తలు వారసులు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ, సంస్కృతి, నైపుణ్యం మీద ఆధారాపడాలని చెప్పేవారు ఏకాత్మతా మానవతా వాదం అని నేడు అందరూ సంబోధిస్తున్నారు.

చిన్న చిన్న పరిశ్రమలు వల్లే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. స్థానికంగా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి యువతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. తద్వారా ఆప్రాంతాలు, రాష్ట్రం, దేశం అబివృద్ది చెందుతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్దాంతాలను నేటికీ బీజేపీ కొనసాగిస్తుంది. 2014 కు ముందు ఎక్కడ చూసినా స్కాంలకు సంబంధించిన వార్తలే మీడియాలో వచ్చేవి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కాంలు పోయి.. స్కీం లు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రతి పేదవాడికి ఆత్మగౌరవరం, ఆత్మస్థైరం పెంచారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీ అత్యున్నతస్థాయికి ఎదిగారు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. తపన ఉంటే సాధించలేనిదేమీ ఉండదని చెప్పడానికి మోడీ జీవితం ఆదర్శ ప్రాయం. ఆక్స్ ఫర్డ్ వంటి యూనివర్సిటీలో చదివితేనే ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టగలరు అనడం కరెక్టు కాదు. దేశం పట్ల సేవ చేయాలని అనుకునే వారు దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని ఇప్పుడు నిరూపించారు.

బ్యాంకింగ్ లో (యన్.పి.ఎ) నాన్ పెర్ఫార్మెన్స్ ఎసెట్ 16శాతంగా ఉన్న సమయంలో వాజ్ పాయ్ 7.8శాతంగా తగ్గించారు. యూపీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత టూ జీ, బొగ్గు, నోటుకు ఓటు, సత్యం, కామన్ వెల్త్ స్కాంలుగా దేశాన్ని మార్చేశారు. ఓట్ల కోసం రాజకీయం చేయడం కాదు.. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమం అందచేయడమే మోడీ పాలనా విధానం.

పేదవాళ్ల కు సంక్షేమం కోసం మోడీ నేడు అనేక పధకాలు అమలు చేస్తున్నారు. ఎఫ్.డి.ఐ ను 300 నుంచి 596బిలియన్ డాలర్లుగా నరేంద్ర మోడీ పెంచారు. పెట్టుబడులకు కావాల్సిన అనుకూల వాతావరణాన్ని దేశంలో మోడీ కల్పించారు. తద్వారా దేశంలో మన బిడ్డలకు ఎన్నో ఉపాధి అవకాశాలు పెరిగాయి. కోవిడ్ వంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం లో రోజుకు 28 కిలోమీటర్లు జరుగుతుంది. లక్ష కిలోమీటర్ల పైబడి ప్రధాన మంత్రి మోడీ హయాంలో రోడ్ల నిర్మాణం చేశారు.

యూపీఎ హయాంలో 49 ఎయిర్ పోర్టులు ఉంటే.. మోడీ హయాంలో 149 కి పెరిగింది. అనేక విమానాశ్రయాలను అభివృద్ది చేసి.. పారిశ్రామిక ప్రగతికి బాటలు వేశారు. పేదవారికి సంక్షేమాన్ని అందిస్తూనే, దేశ ఆర్దిక శక్తిని పెంచి చూపారు. పదో స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకు వచ్చిన ఘనత మోడీది. త్వరలో మూడో స్థానానికి వస్తుందని అంతర్జాతీయ సంస్థలు సైతం చెబుతున్నాయి. ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రతిపేదవారికి వైద్య సేవలు అందించిన ఘతన మోడీది. ఇటువంటి కార్యక్రమాలు చూసే చాలా మంది బీజేపీలోకి వస్తున్నారు. బీజేపీ కండువా వేసుకున్న వారు.. బీజేపీ సిద్దాంతాలను కూడా అందరూ అమలు చేయాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజబాబు తదితరులు వేదిక ను అలంకరించారు.

కృష్ణా జిల్లా పారిశ్రామిక వేత్త వాసిరెడ్డి మనోజ్, ఎన్ ఆర్ ఐ తాతినేని శ్రీ రాం, అనంతపురం జిల్లా ఉరవకొండ కు చెందిన వ్యాపారవేత్త దగ్గుబాటి శ్రీ రాములు దంపతులు, ఎన్టీఆర్ జిల్లా కు చెందిన వ్యాపారవేత్త బొలిశెట్టి కుమార్ ఆధ్వర్యంలో 40మందీ పార్టీ లో చేరారు. పార్టీ లో చేరిన వాసిరెడ్డి మనోజ్ మాట్లాడుతూ పార్టీ ఆశయాలు కు అనుగుణంగా పని చేస్తానని కరతాళ ధ్వనుల మద్య ప్రకటించారు

 

LEAVE A RESPONSE