Suryaa.co.in

Latest post

సినిమా టిక్కెట్లపై ఏమిటీ గోల?

ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ యాక్ట్ గురించి అప్పుడే కొందరు తీవ్రమైన నష్టం జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏముందా చట్టంలో? టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు అంది. అలాగే ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అంది.అంతే కదా … దీని వల్ల ప్రజలకు జరిగే నష్టమేంటి? అభిమానులకు జరిగే…

మనుషులంతా ఒక్కటే.. ఎవడి ఇంజన్ వాడిదే!

వారం రోజులుగా సుబ్బారావుకి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు. ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు. వేడినీళ్ళు, వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం….

ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగాతెలుగు వ్యక్తి

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు….

హన్నన్నా.. జగనన్న కూడా మడమ తిప్పేశారా?

-మార్తి సుబ్రహ్మణ్యం నో… అలా జరగటానికి వీల్లేదు. అందరి మాదిరిగా జగనన్న ఉండకూడదు. అన్న చెప్పాడంటే చేస్తాడంతే. మాట తప్పడం, మడమ తిప్పటం జగనన్న డిక్షనరీలోనే ఉండదు. ఉండకూడదు. జగనన్న అంటే ఒక శిఖరం. ఆయన రేంజే వేరు. ఇక విలువలు, నైతిక రాజకీయాలకు జగనన్న కేరాఫ్ అడ్రస్. చెప్పింది చేయటంలో జగనన్నకు ఏ నాయకుడైనా…

ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌…

పేదలందరికీ ఇళ్ల స్థలాలపై ఏపీ హైకోర్టు స్పందన

మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం లబ్ధి పొందినట్లే. ప్రభుత్వ పథకాల్లో వంద శాతం సంతృప్తి సాధ్యం కాదు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం ఇళ్ల స్థలాలు పొందిన వారందరిపై ఉంది. మహిళల వాదనలు విని ఉంటే సహజ న్యాయసూత్రాలను పాటించినట్లుండేది.

విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం

కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర…

ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లు’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పేర్నినాని మాట్లాడుతూ… సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను…

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ!

గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో ప్రతిపాదిత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో, దాదాపు 8,914 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుండి ఏటా 12…

కీలక నిర్ణయం తీసుకున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ..

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే ఆలోచనలో ఉంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు కార్మికులు. రైతు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనికోసం తగిన కార్యాచరణను రూపొందించారు….