నరేంద్రుడి తల్లికి నూరేళ్లు

-పాదాభిషేకం చేసిన మోదీ
-ఉత్సాహం తగ్గని హీరాబెన్ మోదీ

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ నేడు వందేళ్లు పూర్తి చేసుకున్నారు. . ఈరోజు ఆమె 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తల్లిని మోదీ కలిశారు. ఈ ఉదయం గాంధీనగర్modi-mother1-2-2 లోని తన తల్లి నివాసానికి ఆయన వెళ్లారు. తన తల్లికి పాదపూజ చేసి, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెకు స్వీట్ తినిపించారు. ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను ఆయన సందర్శించనున్నారు.

మరోవైపు వందేళ్ల వయసులో కూడా హీరాబెన్ మోదీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉన్నారు. ఈ వయసులో కూడా ఆమె అనారోగ్యానికి గురయినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. తన చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఆమె ఉంటున్నారు. హీరాబెన్ కు చాలా సింపుల్ ఫుడ్ తీసుకోవడం అలవాటు. ఆమె ఆరోగ్యానికి అదే కారణం కావచ్చని అంటుంటారు. ఎక్కువ మసాలా, నూనె ఉన్న ఆహారాన్ని ఆమె తీసుకోరు. అన్నం, కిచిడి, చపాతి, పప్పు వంటివి ఆమె ఆహారంలో ఉంటాయి. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఆమె ఇష్టపడతారు.

Leave a Reply