Suryaa.co.in

Telangana

కాళేశ్వరంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాళేశ్వరం పై నీటి పారుదల నిపుణులతో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి. కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత అవినీతి మయమైన ఎందుకు పనికి రాని ప్రాజెక్ట్ అని ప్రతి పక్షాలు కొందరు, సామాజిక కార్యకర్త లు, జర్నలిస్టులు నీటి పారుదల నిపుణులు విమర్శలు చేస్తున్నారు
ఇంతగా విమర్శలు ఎదుర్కొన్న ప్రాజెక్ట్ ప్రపంచం లోనే మరొకటి లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, ప్రపంచం లోనే అధ్భుత నిర్మాణం అని, సుమారు యాభై లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది అని, రాత్రి పగలు తన బుర్రకు పదును పెట్టి చక్కటి ప్లాన్ చేశానని ముఖ్య మంత్రి చెప్పుచున్నారు.

ఏది ఏమైనా నిర్మాణం లో తప్పు జరగలేదని, ఒక్క పైసా కూడా వృధా కాలేదని అవినీతి జరగ లేదని నిరూపించు కోవాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వానిది. హరీశ్వర్ రావు,కేసీఆర్ కడిగిన ముత్యం లాగా బయట పడాలి. అవినీతి జరిగితే.. ప్రజా ధనం వృధా అయితే.. బాధ్యత ఎవరు వహించాలి అన్నది కూడా తేలాలి. అవినీతి జరిగి ఉంటే మరి అవినీతి నిరోధక శాఖలు ఏమి చేస్తున్నాయి?ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టింది యెంత ? నీటి వినియోగం వలన ఎన్ని ఎకరాల భూమి పండుతుంది?

ప్రభుత్వం చెబుతున్న లెక్క లలో నిజం ఉందా? చారాన కోడి కి బారాణ మసాలా లాగా ఖర్చు అయిందా ప్రజలకు తెలియాలి. ప్రజల సొమ్ము గుడ్డి గా నీళ్ల పాలు చేయడానికి కుదరదు. ఇప్పటి కైనా నిజ నిర్ధారణ కమిటీ వేసి , నివేదికను ప్రజల ముందు ఉంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాము.
ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడటం సరి అయిన పద్ధతి కాదు.

– నారగొని,ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త

LEAVE A RESPONSE