లోక్‌సభను స్తంభింపచేస్తాం

– ధర్నా ఏర్పాట్లు పరిశీలించిన తలసాని
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా TRS పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీన భారీ ధర్నా చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
బుధవారం ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో ధర్నా ఏర్పాట్లను హోంమంత్రి మహమూద్ అలీ, MLA లు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత ఇతర నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో నూతన ప్రాజెక్టులు నిర్మించి ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కి పాటుపడుతుందని చెప్పారు.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని చెప్పారు. కానీ కేంద్రంలోని BJP ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రం తన వైఖరిని మార్చుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను స్తంభింపచేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఒక తీరుగా మాట్లాడితే రాష్ట్రంలోని BJP నేతలు మరోవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేల12 వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం


చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ TRS ఇంచార్జి ఆనంద్ గౌడ్, ప్రేమ్ సింగ్ రాథోడ్, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కృష్ణ గౌడ్, MN శ్రీనివాస్, BC కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply