సెంచరీ కొట్టిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.వంద కోట్లు దాటింది. మార్చి నెలలో హుండీ ద్వారా రూ.128.81 కోట్ల ఆదాయం లభించింది. కొవిడ్‌ పరిస్థితుల నుంచి తిరుమల నెమ్మదిగా కోలుకుంటున్న క్రమంలో పూర్వపు పరిస్థితులు నెలకొంటున్నాయి.కొవిడ్‌ కారణంగా రెండేళ్లు తిరుమల దాదాపు 30ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో మార్చి మొదటివారం నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. దీంతో తిరుమల క్షేత్రం రెండేళ్ల తర్వాత భక్తులతో సందడిగా మారింది. గత నెలలో 19,72,656మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా రూ.128.81కోట్ల హుండీ ఆదాయం లభించింది.

Leave a Reply